నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 106 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
బెల్లంకొండ మండలం గంగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఆసుల జగన్ అను అతనికి 3 1/2 సంవత్సరాల క్రితం విజయవాడ నందు కడప జిల్లాకు చెందిన జబ్బిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అను అతను పరిచయమైనట్లు, జబ్బిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అను అతను సెక్రటెరియట్ నందు ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పగా ఫిర్యాదు అయిన ఆసుల జగన్ తన అన్న కొడుకు అయిన ఆసుల నాగరాజు అను అతను చదువుకుని ఖాళీగా ఉన్నట్లు, ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడగగా ప్రభాకర్ రెడ్డి ఉద్యోగం ఇప్పించాలంటే ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పగా ఫిర్యాదు అయిన జగన్ 16.07.2021 వ తేదీన సత్తెనపల్లి యాక్సిస్ బ్యాంకు నుండి 2,50,000/-రూపాయలు ప్రభాకర్ రెడ్డి కి ట్రాన్స్ఫర్ చేసినట్లు,
ఆ తరువాత ప్రభాకర్ రెడ్డి ని ఎన్నిసార్లు ఉద్యోగం గురించి అడగగా అదిగో ఇదిగో అని ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నందుకు గాను తగిన న్యాయం కొరకు ఈరోజు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట ఎల్ టి నగర్ నందు నివాసం ఉంటున్న కాటుమాల సంగీతరావు అను అతను చిలకలూరిపేట రోడ్డు ఓవర్ బ్రిడ్జి పక్కన గల లూధరన్ హై స్కూల్ మెయిన్ గేటు పక్కన స్థలమును కొనుగోలు చేసినట్లు, ఆ సమయంలో విక్రయించిన లూధరన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 14 మంది సంతకాలు చేసి పాస్టర్ స్టాంపు వేసి సంతకం చేసి సదరు స్థలమును ఫిర్యాదుకు స్వాధీన పరిచినట్లు, అయితే నాకు విక్రయించిన స్థలమునందు కొండమూడి ప్రీతి కుమార్ మరియు రత్నకుమార్ అనువారు అక్రమంగా గోడలు కడుతుండగా ది.06.03.2025 వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ స్థలం వద్దకు వెళ్లగా ఫిర్యాదుని పెట్టి కొట్టినట్లు మరియు ఒరిజినల్ డాక్యుమెంట్ వారికే అప్పగించమని బెదిరిస్తున్నందుకుగాను తమ న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట పోస్టల్ కాలనీకి చెందిన తుమ్మా రామాంజనేయులు అనువారు తన చిన్ననాటి స్నేహితుడు అయిన తన్నీరు రవికుమార్ కు వ్యాపారం నిమిత్తం ఫిర్యాదు ద్వారా మిత్రుల వద్ద నుండి మొత్తంగా 1,25,00,000/-రూపాయలు తీసుకుని నాలుగు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు డబ్బులు అడిగినప్పటి నుండి రవికుమార్ తన భార్య చేత కేసు పెట్టిస్తానని మరియు ఐపి దాఖలు చేస్తానని బెదిరిస్తున్నందుకు గాను తగు న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఇవ్వడం జరిగింది.
చిలకలూరిపేట గ్రామ నివాసి అయిన కీర్తి లక్ష్మణ కు చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్ నందు గల షాపును చుండూరు నరేంద్ర అను వ్యక్తికి నెలకు 19 వేల రూపాయల చొప్పున అద్దెకు ఇవ్వగా ది.07.07.2024 వ తేదీ నుండి అద్దె చెల్లించకుండా షాపు తెరవకుండా, కనబడకుండా వెళ్ళిపోయినట్లు అనేక సార్లు ఫోన్ చేసిననూ ఫోన్ లో ఫిర్యాదుని అసభ్యకరంగా బూతులు తిడుతూ షాపు ఖాళీ చేయను, నీకు దిక్కున చోట చెప్పుకో అని బెదిరిస్తున్నట్లు, తనకు తెలియకుండా షాపు తాళాలు తీస్తే షాపులోని సామాను పోయాయని ఫిర్యాదు మీద కేసు పెడతానని బెదిరిస్తున్నందుకు గాను ఈరోజు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది
అచ్చంపేట గ్రామానికి చెందిన వలేరు హనుమా అను అతని వద్దనుండి విజయవాడకు చెందిన నాగరాజు మరియు అతని దగ్గర పని చేసే లతా అనువారు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఫిర్యాదు వద్ద నుండి అక్షరాల రెండున్నర లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినటువంటి డబ్బులు అడుగుతుంటే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా రెండు నెలలో ఇస్తామని మభ్యపెడుతున్నందుకు గాను ఎస్పి ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
గురజాల మండలం పల్లెగుంత గ్రామానికి చెందిన నార్ల ఆదిలక్ష్మి రెండవ కుమారుడు అయిన నార్ల లక్ష్మణరావు 10 లక్షల రూపాయలు పోటు రామ్మూర్తి వద్ద అప్పుగా తీసుకొని అప్పు చెల్లించినందుకుగాను ఫిర్యాదు ఇంటిని మరియు భూమిని ఆక్రమించుకున్నట్లు తన జీవిత ఆధారమైన భూమిని వారి వద్ద నుండి తిరిగి ఇప్పించవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
సత్తెనపల్లి పట్టణం వెంగల్ రెడ్డి నగర్ కు చెందిన జడ సురేష్ అను అతను బజాజ్ ఫైనాన్స్ నందు పర్సనల్ లోను 90, 046/- రూపాయలు తీసుకున్నట్లు దానికిగాను వారికి 1,13,132/-రూపాయలు చెల్లించిన తర్వాత ఐదు లక్షల లోన్ ఇప్పించుట కొరకు 30 వేల రూపాయలు వెంకటేశ్వర్లు అదనంగా అడుగగా ఫిర్యాదు ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో బాధలోనూ రద్దు చేయకుండా ఇంకా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని బెదిరిస్తున్నందుకుగాను సదరు బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వెంకటేశ్వర్లు మీద తగు చర్య తీసుకుని వలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.