నారద వర్తమాన సమాచారం
2025 వ సంవత్సరమును అంతర్జాతీయ సహకార సంవత్సరముగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి.. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్
2025 IYC poster ను జిల్లాకలెక్టర్ ఆవిష్కరించారు.
ఐక్యరాజ్యసమితి 2025 వ సంవత్సరమును అంతర్జాతీయ సహకార సంవత్సరముగా గుర్తించినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలలో ఈ సంవత్సరం అంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక వేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యము సహకార సంఘముల ద్వారా నూతన ప్రపంచమును అభివృద్ధి చేయడం, సహకార సంఘముల ద్వారా పర్యావరణమును బలపరచడం, యువతను సహకార వ్యవస్థలోనికి తెచ్చుటకు ప్రయత్నించటం, సభ్యులకు ప్రజాస్వామ్య బద్దంగా నియంత్రణను అలవాటు చేయడం. బహుళార్థక సేవా సహకార సంఘములను ఏర్పాటు చేసి సభ్యులకు సేవలను అందించుట, కంప్యూటరీకరణ ద్వారా సేవలను విస్తృతపరచడము, రైతు ఉత్పాదన సంస్థలు ఏర్పాటు చేసి సహకార సంఘముల ద్వారా విస్తృతంగా సేవలను సభ్యులకు అందించటం… బహుళార్థక గోదాముల ద్వారా గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులు పంటలను నిల్వ చేసుకొనుటకు సదుపాయములు కల్పించడం . 2025 IYC poster ను జిల్లాకలెక్టర్ ఆవిష్కరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.