నారద వర్తమాన సమాచారం
ఉప జిల్లా స్థాయి” మాతృ మరియు శిశు మరణాల” సమీక్ష సమావేశం.
ఈరోజు ది 11/03/2025
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చాంబర్ నందు డాక్టర్ బి.రవి అధ్యక్షతన సబ్ డిస్టిక్ లెవెల్ మాతృ మరియు శిశు మరణాల పై సమీక్ష సమావేశము జరిగినది.
సదరు మీటింగ్ నందు సిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఆరెపల్లి ముప్పాళ్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జరిగిన రెండు మాతృ మరణములు, రామిరెడ్డిపేట యు.పి హెచ్ సి ,సత్తెనపల్లి కో-లొకేటెడ్ పి హెచ్ సి , వినుకొండ కో-లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో జరిగిన మూడు శిశుమరణాల పై సమీక్ష సమావేశం నిర్వహించి ఈ మాతృ మరియు శిశు మరణాలను సంభవించడానికి గల కారణాలను సంబంధిత హాస్పటల్ వారి నుండి అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా సంబంధిత వైద్యాధికారులు మరియు కాన్పులు నిర్వహించిన ప్రైవేటు వైద్యశాల నుండి హాజరైన గైనకాలజిస్ట్ , అనస్తిష్టు , చిన్నపిల్లల వైద్యులను. విచారించి మరణాలకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఈ విధమైన మాతృ మరియు శిశు మరణాలు జరగరాదని సూచించారు. గర్భిణీ స్త్రీలందరిని తగు విధముగా పోషకాహారం తీసుకునే విధంగా తగిన సమయానికి అన్ని గర్భిణీ పరీక్షలు అనగా హిమోగ్లోవిన శాతం మరియు గర్భస్థ శిశువు యొక్క కదలికలను అన్నింటిని తెలుసుకునుటకు గాను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేయు ” అల్ట్రా సోనోగ్రఫీ ” మరియు “టిఫ” పరీక్షలను చేయించుకునే విధంగా గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్. పద్మావతి, డిప్యూటీ. డి ఎం & హెచ్
డాక్టర్ బి.గీతాంజలి డి ఐ ఓ, డాక్టర్ మంత్రు నాయక్, డాక్టర్ లక్ష్మణరావు, బి.సురేఖ డి పి హెచ్ ఎన్ ఓ , సి డి పి ఓ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, ఏ ఎన్ ఎం లు , ఏ ఎస్ హెచ్ ఓలు , తల్లిదండ్రులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పై సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనుమతితో జారీ చేయడం అయినది.
డిప్యూటీ డెమో
డి ఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్,
పలనాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.