నారద వర్తమాన సమాచారం
వ్యాపారస్తులు ఎంఆర్పి కన్నా అధిక ధరలకు అమ్మితే పెనాల్టీలు తప్పవు : డాక్టర్ చదలవాడ హరిబాబు జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పలు షాపులను లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్ రాజు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు మరియు పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు తో కలసి బేకరీలు, కిరాణా షాపులు, కూల్ డ్రింక్ షాపులు, సూపర్ బజార్లు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కొందరు వ్యాపారస్తులు ప్యాకేజ్ కమోడిటీ రూల్స్ ప్రకారం ఉండవలసిన దోశ పిండి మీద కస్టమర్ కేర్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ లేనందున, కిరాణా షాపులో బియ్యం బస్తా పై 26 కేజీలు ముద్రించి ఉండగా దానిని తిరిగి తూకం వేయగా కేవలం 25 కిలోలు మాత్రమే ఉన్నందున మరియు తయారుదారుని చిరునామా ముద్రించనందున, అలాగే కూల్ డ్రింక్ షాపుల వాళ్ళు బాటిల్ మీద ఉన్న ధర కన్నా ఐదు రూపాయలు ఎక్కువగా తీసుకుంటున్నందున, కొన్ని కిరాణా షాపు వాళ్ళు ప్యాకేజీ చేయటానికి లైసెన్స్ కూడా తీసుకోనందున సదరు షాపులపై కేసులు రాయడం జరిగింది. ఈ తనిఖీలలో గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు గాయకోటి బేబీ సరోజిని, మునిపల్లి కవిత, చదలవాడ హరిబాబు, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు పిల్లి యజ్ఞ నారాయణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.