నారద వర్తమాన సమాచారం
ఎం.యు.డి బియ్యం పంపిణీ వాహనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరె…
పల్నాడు జిల్లా నరసరావు పేటలో చౌక ధరల ద్వారా బియ్యం పంపిణీ ఏ విధంగా నడుస్తున్నది అన్నదానిపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గానోరే గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
నరసరావు పేటలో పంపిణీ చేస్తున్న ఎం.యు.డి బియ్యం పంపిణీ వాహనాన్ని తనిఖీ చేశారు.
స్టాక్ వివరాలు ఏ విధంగా ఉన్నాయని ఎం.యు.డి బియ్యం పంపిణీ దారులతో మాట్లాడారు.
బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయంపై వచ్చిన ప్రజల తో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో నరసరావు పేట ఆర్డిఓ మధులత, నరసరావుపేట తహశీల్దార్ తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే తో ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.