నారద వర్తమాన సమాచారం
పునరావాసం తర్వాతే పోలవరం..
కూనవరం :-
సీపీఎం. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పోలవరం ముంపు మండలాలలో పర్యటించారు. ఈ సందర్బంగా కూనవరం లోని గిన్నెల బజార్లో పర్యటించిన ఆయనతో ముంపు బాధితులు మాట్లాడుతూ పోలవరం వల్ల ప్రతి ఏడాది మునుగుతూ నరక యాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. 2022గోదావరి సర్వం కోల్పోయమని అన్నారు.ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్యాకేజీ ఇవ్వడం లేదని అన్నారు. ఒక బాధితం మహిళ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తమ గ్రామంలో ఇళ్ల సర్వే సంబంధించి తమ ఇళ్లకు అంచనా వేసి 7.50 లక్షలు వస్తాయని కాని ఇప్పుడు ఆ ఇంటికి 13 లక్షలైన ఇల్లు కట్టలేమని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నిర్వసితుడికి న్యాయం జరిగే వరకు ఎర్ర జెండా ముంపు బాధితుల పక్షాన ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు బాధితులను ముంచి పోలవరం ప్రాజెక్ట్ కడతామంటే సీపీఎం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ముందు పునరావాసం ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని అన్నారు. ప్రాజెక్ట్ వల్ల గ్రామాలు, పొలాలు రెండు దెబ్బ తింటున్నాయని కాని కొన్ని గ్రామాల్లో ఇళ్లకు, కొన్ని గ్రామాల్లో పొలాలకు పరిహారం ఇచ్చి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేతులు దులుపుకున్నాయని అన్నారు. 2013చట్టం ప్రకారం మూడు రెట్లు ఇవ్వాలని అన్నారు. మునక మండలాలలో 3 వేల మందిని తొలగించారని అన్నారు. 41కాంటూరు, 45 కాంటూరు అనే లెక్కలు కాకుండా కాంటూరు తో సంబంధం లేకుండా ప్రతి నిర్వసితుడికి ప్యాకెజీ ఇచ్చి నిర్వశితులకి న్యాయం చేయాలని అన్నారు. ఎంతో విలువైన భూములు తీసుకొని 2006లో 1లక్ష 15 ఇచ్చారని ఇపుడు 10 లక్షలు ఇస్తూ ముంపు ప్రాంత ప్రజలను అన్యాయం చేయడం ప్రభుత్వాలకు తగదని అన్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు. తాజా సర్వేలు చేయించి ప్రతి నిర్వశితుడికిన్యాయం జరిగేలా ప్రభుత్వం చేయాలని లేకుంటే నిర్వసితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సున్నమ్ రాజులు, మండల కార్యదర్శి బాబు బొర్రయ్య, ఎంపీటీసీ జయసుధ, సర్పంచ్ బొగ్గా వెంకమ్మ, వి. ఆర్ పురం మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్, కర్నాటి శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, గడ్డిపాటి షణ్ముకేశ్వరావు, ధర్మయ్య మడెం బాబు,తమ్మయ్య,సుమన్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.