నారద వర్తమాన సమాచారం
6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రకు ఆహార ప్రయోగశాల ఎక్కడ??
– డా. చదలవాడా హరిబాబు, జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు
గుంటూరు జిల్లా :
దేశంలో చిన్న చన్న రాష్ట్రాలలో ఆహార ప్రయోగశాలలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రయోగశాల నిర్మాణము ప్రారంభమై 15 సంవత్సరాలు దాటినది, నిర్వహణం సరిగ్గా లేకపోవడంతో భవనము దెబ్బతినింది. ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి మరమ్మతులు చేయడానికి 2 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వము స్పందించి ఆహార ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు సిబ్బందిని త్వరితగతిన సమకూర్చి ఆహార ప్రయోగశాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఈ రోజు ధర్మపురి కన్జ్యూమర్స్ మరియు జిల్లా వినియోగదారుల సంఘాల సమావేశము వారు సంయుక్తంగా “ఆహార కల్తీపై నియంత్రణ” పై జరిగిన సమావేశంలో జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యాక్షుడు డా. చదలవాడ హరిబాబు ప్రారంభించి అన్నారు. సమావేశమునకు పలనాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ అధ్యక్షత వహించారు. హరిబాబు ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆహార ప్రయోగశాలలో మైక్రోబయాలజీ, కెమికల్ ల్యాబ్స్ ఉన్నాయి కేవలము 50 శాతం పరికరాలు, నలుగురు సిబ్బంది ఉన్నారు. రసాయనాలు లేకపోవడంతో ఎలాంటి పరీక్షలు జరగడం లేదన్నారు. పిల్లి యజ్ఞ నారాయణ ప్రసంగిస్తూ గత ఫిబ్రవరి 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఆహార ప్రయోగశాలను వర్చువల్ గా ప్రారంభించి సంవత్సరమైనా ఆహార ప్రయోగశాల అందుబాటులోకి రాలేదని, 70 నుండి 80 మంది సిబ్బంది అవసరము ఉంటే కనీసము వాచ్మెన్ కూడా నియమించలేదని అన్నారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు చేకూరి రాజశేఖర్ మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన భద్రతా సూచిక గత ఐదు ఏళ్లుగా అట్టడుగు స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నాడని, ఈ విషయమై వినియోగదారుల కొరకు పనిచేస్తున్న నాయకులు సంఘటితమై న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.