నారద వర్తమాన సమాచారం
బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ చనిపోయిన గోపికృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
నరసరావుపేట
PC 6089 తలపల గోపికృష్ణ బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ తన సొంత చెల్లి అయిన కృష్ణవేణి చేతిలో 16.12.2024 వ తేదీన హత్య గావించబడటం జరిగింది.
అందుకుగాను ఈరోజు పల్నాడు జిల్లా 2013 బ్యాచ్ కానిస్టేబుల్స్ గోపి కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 1,35,000/- రూపాయలను గోపి కృష్ణ భార్య అయిన తలపల హిమబిందు కు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ సమక్షంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసు శాఖ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున పల్నాడు జిల్లా ఎస్పీ
కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ లక్ష రూపాయల చెక్కును అందించడం జరిగింది. అనంతరం గోపికృష్ణ కుటుంబ సభ్యులతో
ఎస్పీ మాట్లాడుతూ శాఖ పరంగా వారికి రావలసిన అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినారు
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్ అసోసియేషన్ ప్రెసిడెంట్ T. మాణిక్యాలరావు ,PC 6150 A.శ్రీనివాస్ ,PC 6066 వల్లభ రావు
పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.