శంకర భారతిపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఘనంగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు
పల్నాడు జిల్లా
నరసరావుపేట:-
శ్రీయుత కమీషనర్, పౌర సరఫరాల శాఖ వారి ఆదేశముల మేరకు శ్రీయుత జిల్లా సంయుక్త కలెక్టర్, పల్నాడు వారి ఉత్తర్వుల మేరకు ది. 15-03-2024 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భముగా పల్నాడు జిల్లా, నరసరావుపేట నందు గల శంకర భారతిపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జిల్లా విద్యాశాఖాధికారి, పల్నాడు వారు సమావేశము ఏర్పాటు చేసినారు. సమావేశమునకు ముఖ్య అతిధిగా కె. మధులత, రెవిన్యూ డివిజనల్ అధికారి, నరసరావుపేట వారు హాజరు అయినారు. ‘స్థిరమైన జీవన శైలికి ఒక సరళమైన పరివర్తన” అనే అంశము పై కన్స్యూమర్ క్లబ్స్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు, స్కూల్ హెడ్ మాస్టర్ యం. పార్వతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ, అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజి అల్లూరయ్య, పౌర సరఫరాల డిప్యూటీ తహసిల్దారులు యం. సత్యనారాయణ, కె.వి. శ్రీనివాస్, కన్స్యూమర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ సంఘాల ప్రతినిధులు P. యజ్ఞ నారాయణ, కె. కుమార్, జి. విద్యాసాగర్, ప్రసంగించినారు. శ్రీయుత రెవిన్యూ డివిజనల్ అధికారి, నరసరావుపేట వారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవమును పురస్కరించుకొని పై అంశముపై నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్ధులకు జ్ఞాపికలను అందచేసినారు మరియు స్కూల్ హెడ్ మాస్టర్ యం. పార్వతి చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్ధులకు మొదటి, రెండవ, మూడవ నగదు బహుమతులు మరియు నాలుగవ, అయిదవ స్థానాల వారికీ కన్సోలేషన్ బహుమతులు అందచేసినారు. నేటి సమాజంలో జరుగుతున్న కల్తీలను గుర్తించి వాటి బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, తూకము విషయములో, ఆన్లైన్ పేమెంట్ ల విషయములో మరియు OTP లను ఉపయోగించే సమయములో తగినంత జాగ్రత్తగా ఉండాలని, బయట వండిన ఆహార పదార్దములు వాడరాదని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేసినారు. స్కౌట్స్ టీచర్ వెంకట రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి సమావేశములు గ్రామ స్థాయి, మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత అవగాహన కల్గుతుందని వ్యక్తం చేసినారు. లీగల్ మెట్రాలజి అధికారులు అల్లూరయ్య తూనికలు కొలతలు ప్రదర్శన నిర్వహించియున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులైన లక్ష్మి నారాయణ పిల్లలు తీసుకొనే చిరు తిండ్ల విషయములో జరుగు రంగుల కల్తీ, టెస్టింగ్ సాల్ట్ వాడకము, కల్తీ టీపొడి గుర్తించుట మొదలగు విషయముల పై స్టాల్ ద్వారా ప్రదర్శన నిర్వహించి వినియోగదారులకు అవగాహన కల్పించియున్నారు. కన్స్యూమర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ సంఘాల ప్రతినిధులు P. యజ్ఞ నారాయణ గారు వినియోగదారులకు అవగాహన కల్పించు విషయమై పోస్టర్లను ఆవిష్కరించి అవగాహన కల్పించియున్నారు. జిల్లా సైన్స్ అధికారి అయిన రాజశేఖర్ కార్యక్రమ నిర్వహణ జరిపి విద్యార్ధిని విద్యార్ధులకు వినియోగదారుల హక్కులపై అవగాహన తెల్పియున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధిని విద్యార్ధులు చక్కటి ప్రతిభ కనబరచి సమావేశము ప్రశాంతముగా జరుగుటకు సహకరించినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.