నారద వర్తమాన సమాచారం
జాతీయ రహదారి విస్తరణ లో భూములు కోల్పోతున్న రావిపాడు గ్రామ రైతులకు నష్టపరిహారం పై నరసరావు పేట ఆర్డీవో కార్యాలయం లో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ప్రత్యేక సమావేశం
పల్నాడు జిల్లా,
జాతీయ రహదారి విస్తరణ లో భూములు కోల్పోతున్న రావిపాడు గ్రామ రైతులకు నష్ట పరిహారం పై పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే బుధవారం ఉదయం నరసరావు పేట ఆర్డిఓ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు సమావేశాన్ని నరసరావు పేట ఆర్డిఓ మధులత, జాతీయ రహదారి విస్తరణ అధికారులు, నరసరావు పేట మండలం,రావిపాడు గ్రామ జాతీయ రహదారి విస్తరణ లో భూములు కోల్పోయిన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, జాతీయ రహదారి విస్తరణ అధికారులు, నరసరావు పేట ఆర్డిఓ మధులత,తహశీల్దార్ వేణు గోపాలరావు. నరసరావు పేట మండల సర్వేయర్ లు మాట్లాడారు.
అనంతరం భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించబడు తుందన్నారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ ఆర్డీవో మధులత, కార్యాలయ ఏవో,నరసరావు పేట తహశీల్దార్ వేణు గోపాలరావు సిబ్బంది,రావిపాడు గ్రామానికి చెందిన జాతీయ రహదారికి భూములు ఇచ్చిన రైతులు పాల్గొన్నారు.







