నారద వర్తమాన సమాచారం
గంజాయి ముఠా అరెస్ట్..కాలేజీ యువకులు విద్యార్థులు టార్గెట్గా గంజాయి విక్రయం
9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సుమారుగా రెండు కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు
మంగళగిరి గ్రామీణ సిఐ శ్రీనివాసరావు
మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్
గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం కట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరసగా మూడు కేసులు నమోదు అయితే పీడీ యక్ట్ లు నమోదు చేయడం జరుగుతుందని మంగళగిరి గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు, గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు.
మంగళగిరి మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన యువకులు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు పోలీసులు టీములుగా ఏర్పడి కాజా గ్రామంలో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాజా గ్రామ పరిధిలోని నంబూరు కెనాల్ వద్ద యువకులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మరియు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. పదిమంది యువకులలో ఒక యువకుడు పరారవ్వగా 9 మందిని స్టేషన్కు తరలించి వారి వద్ద నుంచి సుమారుగా 95 వేల విలువ కలిగిన ఒక కేజీ 900 గ్రాముల గంజాయిని, ఒక స్కూటీని స్వాధీన పరుచుకున్నట్లు ఆయన తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని ఇచ్చాపురం కొండ ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి చిలకలపూడి భాను ప్రసాద్ అనే వ్యక్తి గంజాయిని తీసుకువచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో 20 గ్రాముల బరువున్న ప్యాకెట్ను అమ్ముతున్నాడని ఆయన తెలియజేశారు. ఒక ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరి లో కొంతమంది పై చట్టంలో కొన్ని కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. యువకులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో డి శ్యామ్, సిహెచ్ శేఖర్ బాబు, చలమారావు, సాగర్ బాబు, రాము, వేమన్న కుమార్, సురేష్, పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.