నారద వర్తమాన సమాచారం
పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు నకరికల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా సరళిని పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారా? త్రాగునీరు, ప్రాథమిక చికిత్స కేంద్రం తదితరములు ఉన్నాయా లేదా అని సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అక్కడ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ, హై స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.