పల్నాడు జిల్లా పోలీస్… ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని మెరుగైన విధి నిర్వహణను కనపరచాలి.- జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు,.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని మెరుగైన విధి నిర్వహణను కనపరచాలి.- జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ .
ది.18.03.2025 వ తేదీ నుండి ది.20.03.2025 వ తేదీ ఈ రోజు వరకు మూడు రోజుల పాటు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నూతన చట్టాల పై అవగాహన, శిక్షణ ను ఇవ్వడం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమమును జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల నుండి 55 మంది పోలీస్ సిబ్బందికి
- భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అడిషన్స్ అండ్ రిలేషన్స్.
- భారతీయ న్యాయ సంహిత ఓవర్వ్యూ ఎడిసన్ డెలిసియస్ అండ్ ఆల్టరేషన్ స్
- భారతీయ నాగ్రిక్ సురక్ష సంహిత ఇనె ఇన్ఫర్మేషన్ తూ పోలీస్ అండ్ థెయర్ పవర్స్ టూ ఇన్వెస్టిగేటు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
పోలీస్ స్టేషన్లలోని కానిస్టేబుళ్ళలో చాలామంది ఉన్నత విద్యను అభ్యసించి, ఎన్నో నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారు.వారిలోనీ నైపుణ్యాలను వెలికి తీసి, వాటికి మెరుగులు దిద్ది, పోలీస్ స్టేషన్లో వారు అన్ని విధులు నిర్వర్తించే విధంగా తర్ఫీదు ఇప్పించి తద్వారా వారు సాధికారిత సాధించడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.
పోలీస్ స్టేషన్లో ప్రతి కానిస్టేబుల్ అన్ని విధులు నిర్వహించడం తెలిస్తే,పని భారం ఒకరి మీద పడకుండా అన్ని పనులను అందరూ పంచుకోవచ్చు. అప్పుడు చేసే పని చాలా సులువుగా మారి, పనిచేయాలన్న ఉత్సాహం వారిలో పెంపొందుతుంది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాసే దగ్గర నుండి రఫ్ స్కెచ్,ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు రాయడం, చార్జిషీటు తయారు చేయడం, అరెస్టు కార్డు రాయడం వంటి అన్ని పనులను అందరూ నేర్చుకుంటే ఎన్నో కేసుల్లో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు వేయించడానికి వీలవుతుంది. తప్పులు చేసిన వారికి శిక్షలు పడాలంటే తగిన ఆధారాలు న్యాయస్థానాల్లో సమర్పించాలి. ఏ పని ఏ విధంగా చేయాలో నేర్చుకోవడం వల్ల మెరుగ్గా సరైన ఆధారాలతో న్యాయస్థానాల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయగలుగుతాం. అప్పుడే న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్షలు పడడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బాధితులకు మనం సకాలంలో న్యాయం చేయడానికి వీలవుతుంది.
కావున అందరు కూడా అన్ని పనులు నేర్చుకోవాలని ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులను ప్రారంభించడం జరిగింది.
ఇక్కడ ఉన్న 55 మంది పోలీసు సిబ్బంది ఈ మూడు రోజుల శిక్షణ కాలంలో తమకు తెలిసిన విషయాలను గురించి మరింత లోతుగా అవగాహన చేసుకున్నారని, పోలీస్ స్టేషన్లో మునుపటి కంటే మరింత మెరుగ్గా సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం.
ఈ శిక్షణా తరగతులు సి హెచ్ . లోకనాథం ట్రాఫిక్ సిఐ, నర్సరావుపేట,ఎమ్. శ్రీనివాసరావు (CI,DCRB) K.V. సుభాషిని సీఐ మహిళా పోలీస్ స్టేషన్ నరసరావుపేట, ఏ. శశి కుమార్ ఎస్సై,DSB,
జీ. అరుణ జ్యోతి (WASI,DCRB) ఈ శిక్షణ తరగతులు జిల్లా ఎస్సీ ఎస్టీ సీఐ బి. రమేష్ బాబు పర్యవేక్షణలో జరిగినవి
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ఎస్సీ ఎస్టీ సీఐ బి. రమేష్ బాబు గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.