నారద వర్తమాన సమాచారం
ఏపీకు గుడ్‌న్యూస్, విజయవాడ, విశాఖ మెట్రోలకు కేంద్రం నిధులు
ఆంధ్రప్రదేశ్‌కు ఒకేసారి రెండు మెట్రో ప్రాజెక్టులు రానున్నాయి. ఒకటి విజయవాడ మెట్రో కాగా రెండవది విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు.
ఏపీలో అటు విజయవాడ ఇటు విశాఖపట్నం రెండు నగరాల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమైంది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపొందించాలని కోరిన కేంద్ర ప్రభుత్వం దీనికోసం నిధులు కూడా మంజూరు చేసింది. సీఎంపీ రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. రెండు నగరాల మెట్రో ప్రాజక్టు సీఎంపీ తయారీకు సిస్టర్ ఎంవీఏ సంస్థను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు సీఎంపీకు 84.47 లక్షలు, విజయవాడకు 81.68 లక్షలు ఖర్చు కానున్నాయి. దీనికి సంబంధించిన నిధుల్ని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కేంద్రం మంజూరు చేసింది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు 66.15 కిలోమీటర్ల పొడవుతో రానుంది. మొదటి దశలో 38.4 కిలోమీటర్లు కాగా రెండవ దశలో 27.75 కిలోమీటర్లు ఉంటుంది. మొదటి దశలో 1152 కోట్లతో భూసేకరణ, 11,009 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి మొత్తం మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో ఉంటుంది.
ఇక విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కూడా మూడు కారిడార్లలో నిర్మితం కానుంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసుకు 5.08 కిలోమీటర్లు, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లలో నిర్మించనున్నారు. ఇక కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లతో రెండవ దశ ఉంటుంది. మొత్తం 76.9 కిలోమీటర్లతో విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఉంటుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.