నారదా వర్తమాన సమాచారం
ఉగాది ఆస్థానానికి టీటీడీలో 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
25, 30న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
నేటి నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు స్వీకరణ.. సోమవారం దర్శనాలు ప్రారంభం.
ఇక ఏపి ప్రజాప్రతినిధుల లేఖపై సోమవారం బ్రేక్ దర్శనాలు లేనట్టే..
తెలుగు నూతన “విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఆదివారం శాస్త్రోక్తంగా తిరుమల ఆలయంలో జరగనుంది. ఈ సందర్భంగా 30వ తేదీ విఐపి బ్రేక్ దర్శనాలు టిటిడి రద్దు చేసింది. అలాగే 29వతేదీ విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఉగాది పర్వదినానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 25వతేదీ మంగళవారం ఉదయం నిర్వహిస్తున్నారు. ఉదయం 6గంటల నుండి 11గంటల వరకు పవిత్ర జలంతో శుద్దిచేస్తారు. మంగళవారం విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. 24వతేదీ సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. ఆరోజు అష్టదళ పాదపద్మారాధన సేవ కూడా రద్దు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు సుప్రభాతం అనంతరం ఆలయ శుద్ది చేస్తారు. ఆ తరువాత పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలివద్ద ఆగమపండితులు, అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.