నారద వర్తమాన సమాచారం
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్
పల్నాడు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం.
గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి పై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కుటుంబ సభ్యులు తమ బిడ్డలు కానీ, తమ భర్తలు కానీ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని,
ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు గుర్తించాలి.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు సమాచారం ఎవరిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
డయల్ 100/112 కు సమాచారం అందించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.