నారద వర్తమాన సమాచారం
శ్రీ కృష్ణుని క్షేమము తెలుసుకోనుటకు అర్జునుడు ఎక్కడికి వెళ్ళినాడు..?
శ్రీమద్భాగవతము - ప్రథమ స్కంధము
శ్రీకృష్ణ నిర్యాణము
శ్రీ కృష్ణుని క్షేమము తెలుసుకోనుటకుగాను అర్జునుడు ద్వారకకు వెళ్ళినాడు. ఏడుమాసములైనను తిరిగిరాలేదు, హస్తినాపురమున ఘోరమైన అవళకునములు కాన్పించెను.
ఋతువులు తారుమారయ్యెను. ప్రజలలో క్రోధము, లోభము, అసత్యము మితిమీరిపోయెను. జీవికకుగాను జనులు పాపములకే ఒడి కట్టిరి. పర్వత్ర కపటము నిండిపోయెను.
స్నేహమందును మోసము కాననయ్యెను. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, బంధువులు జగడములాడిరి, ప్రజలు నీచవృత్తు అవలంబించిరి.
“నక్క సూర్యునివైపు మోరఎత్తి అరచుచు నోట నిప్పులు కక్కుచున్నది. ఆవులు మున్నగునవి అప్రదక్షిణముగను, గాడిదలు మున్నగునవి ప్రదక్షిణముగను తిరుగుచున్నవి.
గువ్వ, గుడ్లగూబ కాకి ఘోరముగా అరచుచున్నవి. దిక్కులు పొగలు క్రమ్మినవి. తేవతేవకు భూకంపము వచ్చుచున్నది. కొండలు గడగడ లాడుచున్నవి.
మబ్బులులేని పిడుగులు పడుచున్నవి. ఉరుములు ఉరుముచున్నవి. సుడిగాలి రేగి నలువైపుల చీకటి క్రమ్ముచున్నది. ఆకసము నెత్తుటి వానకురియుచున్నది. సూర్యశాంతి మాసి పోయినట్లు అయినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.