నారద వర్తమాన సమాచారం
కాంతి కిరణం యొక్క చివరను మనం చూడలేము. ఎందుకని?
✳ కాంతి కిరణం అంటే కాంతి పయనించే మార్గాన్ని చూపే సరళరేఖ. నిజానికి మనం చూసేది కాంతికిరణం (light ray) కాదు. మనకి కనబడేది కాంతి పుంజం (light beam). ఇది కొన్ని కాంతి కిరణాల సముదాయం. మన కంటివైపు నేరుగా దూసుకు వచ్చే కాంతి పుంజాన్ని మనం చూడగలుగుతున్నామంటే దానర్థం దానిలోని కాంతి శక్తి మన కంటికి చేరిందనే. కాంతి శూన్యంలో కూడా పయనించే విద్యుదయస్కాంత తరంగం. ఈ తరంగాలు సరళమార్గంలో అత్యంత వేగంగా సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో వాటిని ఏదైనా వస్తువు శోషించేవరకు కానీ, వాటి మార్గాన్ని మార్చేవరకూ కానీ పయనిస్తూ ఉంటాయి. రాత్రి వేళల్లో ఒక టార్చిలైటును ఏటవాలుగా ఆకాశంవైపు వేస్తే చీకట్లోకి అతి వేగంగా పయనించే ఆ కాంతిపుంజం ముందు భాగాన్ని మనం చూడలేం. అలాగే టార్చ్‌లైట్‌ను ఆపుచేసినా కాంతి పుంజం చివరనూ మనం మనం చూడలేం. దానికి కారణం కాంతిశక్తి అత్యంత వేగంగా ప్రయాణించడమే.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.