నారద వర్తమాన సమాచారం
ఈనెల 31వ తేదీకి ముందుగానే రేషన్ లబ్దిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి–
జాయింట్ కలెక్టర్ సూరజ్
మార్చి,26:ఈనెల 31వ తేదీకి ముందుగానే రేషన్ లబ్దిదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని,సదరు ఈకేవైసీ ప్రక్రియను లబ్ధిదారులతో సత్వరమే పూర్తి చేయించవలసినదిగా జిల్లాలోని అందరూ పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్ల ను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ఆదేశించారు.
ఈ ప్రక్రియను నూటికి 100 శాతం పూర్తి చేయాలని సూచనలు చేయాలన్నారు.
దీనిని అమలు చేసేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నారు.
గ్రామ వార్డు సచివాలయాల్లో ,రేషన్ షాపులలో డీలర్ వద్ద ఉన్న ఈ-పాస్ పరికరాలు ద్వారా, మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చునన్నారు.
5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా, మిగిలిన లబ్దిదారులు ఈకేవైసీ ప్రక్రియను తక్షణమే
పూర్తి చేయాలన్నారు. ఇది ముఖ్యంగా రేషన్ పంపిణీ వ్యవస్థను సక్రమమగా అమలు
చేయడానికి, అక్రమ వినియోగాన్ని నివారించడానికి
ఉపయోగపడుతుందన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.