నారద వర్తమాన సమాచారం
నేడు తిరుమలలో తాళ్లపాక అన్నమయ్య 522వ వర్థంతి మహోత్సవం
పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 522వ వర్థంతి మహోత్సవాన్ని నేడు తిరుమలలో టీటీడీ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.