నారద వర్తమాన సమాచారం
ఆక్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై ఎఫ్ఎఆర్ నమోదైంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇటీవల దిల్లీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా దిల్లీ పోలీసులు కేజ్రీవాల్ పై ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది.2019లో ద్వారకలో భారీ హోర్డింగ్లు ఏర్పాటుచేయడానికి ప్రజానిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ దిల్లీ రౌన్అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కేజీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఎఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్ధనను దిల్లీ కోర్టు అంగీకరించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.