నారద వర్తమాన సమాచారం
దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సాగును పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్
దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న కోటి రెడ్డి అనే రైతు పి ఎం డి ఎస్ ( ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) 30 రకాల విత్తనాలు వేసిన పొలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు పరిశీలించారు. అనంతరం ఏటీఎం మోడల్ విధానాల్లో అనగా 18 రకాల మొక్కలు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఉల్లి కొత్తిమీర గోంగూర పాలకూర చుక్కకూర తోటకూర కాయలు వేసిన పొలాలను పరిశీలించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా ముఖ్యంగా పీఎండిఎస్ వేసుకోవడం వల్ల. భూసారం పెరుగుతుందని , , నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఖరీఫ్ లో వేసుకో బోయే పంటలకు కావాల్సిన పోషకాలని నేల నుంచి అందించడానికి సాధ్యమవుతుంది దీంతోపాటు రసాయనిక ఎరువులు, రసాయనక పురుగు మందులు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మురళీకృష్ణ, మండల ప్రత్యేక అధికారి గబ్రు నాయక్ ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జి వాణి , ఐ సి ఆర్ పి ప్రసన్నలక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.