నారద వర్తమాన సమాచారం
35 సంవత్సరాలు దీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ASI P. సురేంద్రనాథ్ బెనహర్ బాబు
ఈరోజు(01.04.2025) జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన P. సురేంద్రనాథ్ బెనహర్ బాబు ను పూల మాలలు, దుస్సాలువాల తో ఘనంగా సన్మానించి, సత్కరించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ ఇతర పోలీస్ అధికారులు.
ASI 1339 P. సురేంద్రనాథ్ బెనహర్ బాబు గారు 1990 సం.లో పోలీస్ శాఖలో చేరి సుమారు 35 సం.ల సుదీర్ఘ సర్వీసును పూర్తి చేసి ఈరోజు ఉద్యోగ విరమణ పొందటం జరిగింది.
P.సురేంద్రనాథ్ బెనహర్ బాబు బెల్లంకొండ పీఎస్ నందు ASI గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందినారు.
పోలీస్ శాఖలో ఎన్నో ఆటుపోట్లను దాటుకుని ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ పొందటం చాలా సంతోషకరమైన విషయం.
సుమారు 35 సం.రాలు వివిధ స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలందించడం సామాన్య విషయం కాదని,అప్పట్లో నక్సలిజం, అరకొర సదుపాయాలు, రవాణా సౌకర్యాల కొరత మొదలగు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ పొందటం ఎంతో సంతోషకరమైన విషయం అని ఎస్పీ తెలిపారు.
వారు దీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహించారంటే వారి కుటుంబ సభ్యుల త్యాగం, సహకారం ఉండటం వల్లనే ఇది సాధ్యం అయిందని, కావున వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు, మీ సేవలు భావితరాలకు ఆదర్శనీయం.మీకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఎస్పీ తెలిపారు.
తమ విధి నిర్వహణ కొరకు అనువైన వాతావరణం కలిపించి, తమకు సహకరించిన గౌరవ ఎస్పీ గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఉద్యోగ విరమణ పొందిన ASI P. సురేంద్రనాథ్ బెన్హర్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు J.V. సంతోష్ (అడ్మిన్),V.సత్తి బాబు (పరిపాలన),AO KVV రామారావు , AR DSP మహాత్మా గాంధీ రెడ్డి పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ T.మాణిక్యాల రావు , హోం గార్డ్ RI S.కృష్ణ
వెల్ఫేర్ RI L.గోపినాథ్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.