నారద వర్తమాన సమాచారం
బస్తాలకు బస్తాలే అమ్మేస్తున్న రేషన్ డీలర్లు
పల్నాడు జిల్లా :-
స్థానిక ప్రజా ప్రతినిధులను అధికారులను మామూలతో మేనేజ్ చేశామని బహిరంగంగా మాట్లాడుతున్న రేషన్ డీలర్లు
పల్నాడుజిల్లాలో పిడిఎస్ మాఫియాకు రేషన్ డీలర్ల కు ఉన్న కనెక్షన్ బహిరంగ రహస్యం మొన్నటి వరకు రేషన్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని పి.డి.ఎస్ నిర్వాహకులు ఇతర సంచులలో సర్ది రవాణా చేసేవారు కానీ ఈసారి పి.డి.ఎస్ మాఫియా బరితెగించింది. పోలీసులకు రెవెన్యూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులుకు నెలవారి మామూలు ఇస్తున్నామని డైరెక్ట్ గా రేషన్ బియ్యం ప్రభుత్వ గోదాముల నుంచి వచ్చే సంచుల్లోనే తరలించి రీసైక్లింగ్ కు తరలిస్తున్నారు పల్నాడు జిల్లా రేషన్ బియ్యం నేరుగా మిల్లర్లు లేదా పిడిఎస్ రైస్ బడా మాఫియా కు తరలించి సొమ్ము చేసుకుంటున్న విషయం తెలిసిందే ఇటీవల వరకు పల్నాడు జిల్లాలో పిడిఎస్ మాఫియాతో రేషన్ దుకాణాల నిర్వహకులు కుమ్మక్కయ్యారు పల్నాడు జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల నుంచి నిత్యం రేషన్ బియ్యం నేరుగా అమ్మేస్తున్నారు ప్రధానంగా నగరాలలో చాలామంది ప్రజలు రేషన్ బియ్యం తినడం లేదు నిత్యం రేషన్ దుకాణం నుంచి ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ దందా 21వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగుతుంది అందులో భాగంగా నిత్యం 3 టన్నులు పైచిలుకు బియ్యం పిడిఎఫ్ మాఫియా చేతుల్లోకి నేరుగా వెళ్ళిపోతుంది ప్రభుత్వం పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యము కొనుగోలు చేయవద్దని అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఉన్న6 ఏ కేసులు నమోదు చేస్తున్న పిడిఎస్ మాఫియా మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు. అందుకు రేషన్ డీలర్ల వెన్నుదన్నె కారణం పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రేషన్ బియ్యంను పట్టుకొని నెలలు గడిచిపోయాయి. రేషన్ బియ్యం బహిరంగంగా దొరికిపోతే తాము స్వచ్ఛంద సంస్థలకు అనాధ ఆశ్రమాలకు మదర్శాలకు డొనేట్ చేసేందుకు సంబంధిత బియ్యాన్ని తీసుకువెళ్తున్నామని కేసుల నుంచి తప్పించుకుంటున్న ఘటనలు ఉన్నాయి ప్రధానంగా రేషన్ డీలర్ల పై చర్యలు తీసుకోకపోవడంతోనే వారు పిడిఎస్ మాఫియాతో మిలాకత్ అయ్యి ప్రభుత్వ బియ్యాన్ని పేదలకంటే గద్దలకే అంట గడుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ బియ్యం లెక్కల వారీగా దుకాణాలకు రాకుండా నేరుగా డీలర్లు చెప్పిన లెక్కల ప్రకారం తక్కువ మొత్తంలో డంపు చేసి మిగిలిన మొత్తాన్ని పిడిఎఫ్ మాఫియా కె లేదా రైస్ మిల్లర్లకు నేరుగా అమ్మేసుకుంటున్నారని వాదనలు ఉన్నాయి. పల్నాడు జిల్లా కేంద్రంగా జరుగుతున్న పిడిఎస్ మాఫియా కు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.