నారద వర్తమాన సమాచారం
ఆరోగ్యమే మహాభాగ్యం….ఆరోగ్య కరమైన ఆకుకూరలు కూరగాయలు తినాలి..డిపిఎం.అమలకుమారి
నరసరావుపేట
వేదిక = పత్తిపాటి పుల్లారావు కళ్యాణమండపం
(ఆహారం….ఆరోగ్యం)
డిపిఎం అమలుకుమారి
పల్నాడు జిల్లా..
ప్రకృతి వ్యవసాయ విభాగం….
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు…
అయితే ఈనాడు ఎక్కువ గా అనారోగ్యాలు చిన్న వయసులోనే వస్తూ ఉన్నాయి.. షుగర్,బీపీ,క్యాన్సర్, థైరాయిడ్ ఎలా చెప్పుకుంటూ పోతే అనేక రోగాలు మనిషిని ఆవరించి ఉన్నాయి .. వాటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ప్రకృతి వ్యవసాయం.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు కరంగా ను,తినటానికి రుచికరంగాను.., ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి.. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకున్న కొద్దిపాటి స్థలంలో పెరటి తోటలు పెంచుకొని ఆరోగ్య కరమైన ఆకుకూరలు కూరగాయలు తినాలని డిపిఎం అమలకుమారి తెలియజేశారు.. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా,, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు.. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు.. యం పి లావు శ్రీకృష్ణదేవరాయలు.. అలాగే జిల్లా అధికారులు.. రైతులు మరియు అర్జీదారులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొని..ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించి.. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకుని వెళ్లే విధంగా రైతులను ప్రోత్సహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం లో పంటలు పండించుకొని.. భూమి ఆరోగ్యాన్ని మరియు ప్రజలందరూ ఆరోగ్యాన్ని కాపాడాలని శాసనసభ్యులు రైతులకు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అంతా పాల్గొని వచ్చిన వారికి అందరికీ ఆరోగ్యకరమైన.. ఆకుకూరలు, కూరగాయలు కూరగాయలు, పసుపు కారము బియ్యం.. మరియు నిత్యవసర వస్తువులను ఫుడ్ బాస్కెట్ కు సంబంధించిన అన్ని రకాలు..ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం జరిగినది.. అలాగే ప్రతి సోమవారం మండల ఆఫీస్ లో ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తు లు అందరికి అందుబాటులో ఉంచటం జరుగుతుంది.. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవాలని శాసనసభ్యులందరికీ తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరు పాల్గొనడం జరిగింది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.