నారద వర్తమాన సమాచారం
ఏంజెల్ ఫ్రైడ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ ఆర్గనైజేషన్ పల్నాడు జిల్లా ఈసీ మెంబర్గా రమావతి వెంకటేశ్వర్లు నాయక్
గండిగనుమల
ఏ.పి. వినియోగదారుల హక్కుల పరిరక్షణా సంస్థ ఏంజెల్ ప్రైడ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం. సోమవారం నరసరావుపేట పట్టణం లో ఎల్.బి. కూరగాయల మార్కెట్ వద్ద గల పిల్లి నాగన్న సత్రం ఫంక్షన్ హాల్ నందు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగాను, పలు జిల్లాల పరిధిలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణా సంస్థ ఏంజెల్ ప్రైడ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ & ఆర్గనైజేషన్, పల్నాడు జిల్లా ఈసీ మెంబర్గా రమావతి వెంకటేశ్వర్లు నాయక్ గండిగనుమల ఎన్నికయ్యారు.
ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పిల్లి.యజ్ఞ నారాయణ చేతుల మీదుగా వెంకటేశ్వర్లు నాయక్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ ఐడి కార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా వినియోగదారుల సమస్యలను పరిష్కారానికి ప్రతి నియోజకవర్గంలో తన వంతుగా కృషి చేస్తానని అలాగే పల్నాడు జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు సమస్యలు ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు….సంప్రదించవలసిన ఫోన్ నెంబర్..8106165261
Discover more from
Subscribe to get the latest posts sent to your email.