నారద వర్తమాన సమాచారం
నేడు సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన
అమరావతి
సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఉదయం 8:51 గంటలకు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వెలగపూడి సచివాలయం వెనుక ఈ9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయిం చారు. అందులోభాగంగా ఇటీవల అమరావతిలో ఐదు ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అలాగే అదే సమయంలో ఆమె తన గాజులను దానంగా అందజేశారని రైతులు వివరించారు.
ఆ కుటుంబానికి తమ గ్రామం ఎంత ఇచ్చినా తక్కువేనని.. ఉడతా భక్తి కింద ఆ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.2500 గజాల్లో రాజధాని ఇంటి నిర్మాణాన్ని సీఎం చంద్ర బాబు చేపట్టనున్న సంగతి తెలిసిందే.
కార్యాలయం, నివాసం లోపాటు కారు పార్కింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.