నారద వర్తమాన సమాచారం
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి అలర్ట్.. ఏపీ లో ఈనెల రేషన్ తీసుకునే వారి పేరు ఎర్రర్ చూపిస్తుందా… అయితే ఈ వార్త తప్పక చదవాలి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారిని అలర్ట్ చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులో పేరు ఉండి, ఈకేవైసీ చేయించుకోని వారు ఈ నెల 30లోగా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్, ఎండీయూ వాహనంలో ఈ పోస్ మెషిన్ అందుబాటులో ఉంటుంది. అందులో లబ్ధిదారుల రేషన్‌కార్డు వివరాలు నమోదు చేస్తే చాలు.. కుటుంబసభ్యుల వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ పోస్ మెషిన్‌లో ఎర్ర రంగు బాక్స్‌లో పేర్లు ఉంటే.. ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రీన్ కలర్ (ఆకుపచ్చ రంగు)లో ఉంటే వారి ఈకేవైసీ పూర్తయినట్లే లెక్క. అప్పుడు వారు రెడ్ కలర్ (ఎర్ర రంగు) గడిలో పేరు ఉన్న వారు వేలిముద్ర వేస్తే చాలు ఈకేవైసీ పూర్తవుతుంది.
ఒకవేళ లబ్ధిదారులు ఈకేవైసీ వివరాలు తెలుసుకోవాలంటే.. వెంటనే గూగుల్ వెబ్ బ్రౌజర్‌లో epds1 అని నమోదు చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, ఏపీ’ అనే సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది.. ‘రేషన్ కార్డు సెక్షన్‌లో 6 రకాల ఆప్షన్లు ‘న్యూ’ అనే పేరుతో ఉంటి.”EPDS APPLICATION SEARCH”, “RICE CARD SEARCH” రెండు ఆప్షన్లలో ఒకదానిపై క్లిక్ చేసి.. రేషన్ కార్డు నంబర్ నమోదు చేయగానే అందులో ఉన్న వారి పేర్లు వస్తాయి. ఈ పేర్ల ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని ఉంటే వారి ఈకేవైసీ పూర్తి చేసినట్లే. అలా లేకుండా ఇంకేమైనా ఉంటే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. డీలర్/రేషన్ బండి దగ్గర ఈ పోస్ యంత్రంలో వేలిముద్ర వేసి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి ఈ నెల 30 డెడ్‌లైన్‌గా విధించారు. ఐదేళ్లలోపు వారిక, 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసీ అవసరం లేదు.. మిగిలిన అందరూ ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే’ అని అధికారులు కోరుతున్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.