నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా మాచర్లలో ఉన్న లక్ష్మీశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు హాజరైన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్ ఎస్పి కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
పల్నాడు జిల్లా మాచర్లలో వేంచేసి ఉన్న లక్ష్మీ ఈశ్వర స్వామి ఆల దేవాలయంలో నేటి నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పి .అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు తో కలిసి గురువారం చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారుల నుండి వివరాలు సేకరించారు. ఈనెల 17వ తారీఖున నిర్వహించనున్న రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రథాన్ని పరిశీలించారు. ఎంతమంది భక్తులు వస్తారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మురళీకృష్ణ, మండల ప్రత్యేక అధికారి గబ్రు నాయక్ మండల రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్, మండలాధికారులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు పూర్ణకుంభ స్వాగతం పలికారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.