నారద వర్తమాన సమాచారం
ప్రకృతి వ్యవసాయం లో మండల
సమన్వయ సమావేశంలో పాల్గొన్న
డిపియం కె. అమల కుమారి…
పల్నాడు జిల్లా
ప్రకృతి వ్యవసాయ విభాగం..
ఈరోజు నాదెండ్ల మండలం లో రైతు సేవ కేంద్రం లో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో.. వ్యవసాయ శాఖ, వెలుగు (డి ర్ డి ఏ ) మరియు పకృతి వ్యవసాయ విభాగం వారి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది… ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం సార్వత్రిక నవ సూత్రాలను డిపియం అ మల కుమారి అందరికి తెలియజేయడం జరిగింది..వ్యవసాయ శాఖ వారు వారి పరిధిలో ఉన్న రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించాలని, రైతులందరికీ పిఎండిఎస్ గురించి తెలియజేసి రైతులు వారి పొలంలో పీఎండీఎస్ వేసుకునే విధంగా గ్రామ వ్యవసాయ అధికారులు(వి ఎ ఎ )లు రైతులకు అవగాహనా కల్పించాలని వారికి తెలియజేయడం జరిగింది.. రైతు సాధికార సంస్థ గుంటూరు నుండి విచ్చేసిన శ్రీనివాస రావు ఏ ఓ, వెలుగు వారు పీఎం డేస్ కిడ్స్ తయారు చేయడానికి.. కావలసిన రుసుమును మహిళా సంఘాల ద్వారా రుణము రూపంలో అందించాలని. తెలియ జేశారు . అందరూ సమన్వయం తో పని చేసి.. రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత చేరువ చేయాలని వారు తెలియజేయడం జరిగింది.. కాబట్టి రైతులందరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని పిఎండిఎస్ విత్తనాలు పొలాల్లో వేసుకొని భూమిని సారవంతం చేసుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యాలయం నుండి వచ్చిన ఉషారాణి,లక్ష్మీ, మన్విత, అడిషనల్ డిపియం ప్రమ్ రాజు, వెలుగు
ఏ పి యం , సి సి లు, అలాగే మండల వ్యవసాయ అధికారి వెంకట్రావు , వి ఎ ఎ లు అలాగే యన్ ఫ్ ఎ నంద కుమార్
యన్ యఫ్ ఎ మేరీ, యన్ ఫ్ ఎ అప్పలరాజు
యన్ ఫ్ ఎ సౌజన్య
మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు మహిళలు అందరు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.