నారద వర్తమాన సమాచారం
రేపు(14.04.2025) తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నెకల్లు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు.బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన గుంటూరు జిల్లా ఎస్పీసతీష్ కుమార్ ఐపిఎస్
డాక్టర్ B.R.అంబేద్కర్ జన్మదిన వేడుకల కార్యక్రమానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు
జన్మదిన వేడుకలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తగినంత మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, వారికి బందోబస్తు విధుల గురించి బ్రీఫింగ్ నిర్వహించిన ఎస్పీ
ముఖ్యమంత్రి హెలిప్యాడ్ మరియు సభా ప్రాంగణానికి విచ్చేసినది మొదలు,మరలా తిరిగి వెళ్ళు వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ, సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మీ యొక్క ఇంచార్జి పోలీస్ అధికారికి తెలియపరచాలని తెలిపారు.
ప్రతి ఒక్క పోలీస్ అధికారి మరియు సిబ్బంది సకాలంలో మీకు కేటాయించిన విధి నిర్వహణ ప్రదేశానికి చేరుకొని, ఆ ప్రదేశంలో మాత్రమే హాజరుగా ఉండి విధులు నిర్వహించాలని తెలిపారు.
భద్రతా బృందాల వారు మీకు కేటాయించిన ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, తరువాత ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వీవీఐపి దగ్గరికి అనుమతించాలనీ తెలిపారు.
వాహనాల పార్కింగ్ ప్రదేశాల వద్ద బందోబస్తు విధుల కోసం కేటాయించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ప్రతి ఒక్క వాహనాన్ని ఒక క్రమంలో పార్కింగ్ ప్రదేశంలో నిలుపుదల చేసే విధంగా చూస్తూ, ట్రాఫిక్ పోలీస్ వారితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు జివి రమణమూర్తి ATV రవికుమార్ శ్రీమతి సుప్రజ , ఏ హనుమంతు తుళ్లూరు డి.ఎస్.పి మురళీకృష్ణ ఇతర డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.