నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి
పిడుగురాళ్ల పట్టణం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పర్వతనేని శ్రీధర్ ఆద్వర్యంలో డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి సందర్బంగావారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనం గా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ మన భారతదేశం లో చాలా మందికి మానవ హక్కుల విలువలు కూడా తెలియదు. మన దేశ ప్రజలకు రాజ్యాంగ గ్రంథం పై పూర్తి స్ధాయి లో అవగాహన కలిగించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయించాలని కోరారు. అలాగే ముఖ్యంగా యువతకు మన రాజ్యాంగం పై పూర్తి స్థాయి లో అవగాహణ కల్పించడం వల్ల రాజ్యాంగ గ్రంథంలో విషయాలు తెల్సుకోవడం వల్ల తప్పు ఒప్పులు తెలుస్తుందని అలాగే తప్పులకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెల్సుకోవడం వల్ల యువత మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు. మన రాజ్యంగ గ్రంథంలోని అన్ని విషయాలు తెల్సుకొని దేశాన్ని ముందుకు నడిపించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను,శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించు కోవాలి భీంరావ్ రాంజీ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 జన్మించారు. “బాబాసాహెబ్” అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు. వృత్తి రీత్యా న్యాయవాది.భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ‘ భారతరత్న ‘ అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశారు. ఇలాంటి మహనీయుల స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.