నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ని అక్షరాస్యల జిల్లాగా చూడాలి కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
ఉల్లాస్ మొదటి ఫేజ్ లో 10,164 మందికి అక్షరాస్యత
రెండవ ఫేజ్ లో 30,000 మందిని అక్షరాస్యులను తయారు చేస్తాం
: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
2024-25 లో ఉల్లాస్ ( అందరికీ అక్షరాస్యత ) కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు.
2025-26 విద్యా సంవత్సరంలో 30,000 మంది విధాన, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యులను తయారు చేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉల్లాస్ పథకంపై జిల్లాస్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
మొదటి ఫేజ్ లో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రెండవ ఫేజ్ లో పట్టణ ప్రాంతాల్లో సైతం నిరక్షరాస్యులను గుర్తించి తరగతులు నిర్వహించాలన్నారు. ఆ మేరకు మున్సిపాలిటీల్లో ప్రాంతాల్లో ఉల్లాస్ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
సెర్ప్, మెప్మా లబ్ధిదారులు, జెడ్పీ, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది, అంగన్ వాడీ సహాయకులు, ఉపాధి హామీ కూలీలలో నిరక్షరాస్యులను గుర్తించి నమోదు చేయాలన్నారు.
సెర్ప్, మెప్మా అధికారులు ప్రతి పది మంది అభ్యాసకులకు ఒక విద్యా వాలంటీర్ చొప్పున నియామకాలు చేపట్టాలన్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాల్లో తరగతులు నిర్వహించి జిల్లాలోని ప్రతి ఒక్కరూ రాయడం, చదవడం, ఆర్థిక లావాదేవీలు చేయగలిగేలా శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య అధికారి జగన్ మోహన్ రావు, డీఈవో చంద్రకళ, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, గ్రామ & వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.