నారద వర్తమాన సమాచారం
ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ.ఇ.ఆర్.యు యూనియన్
నూజివీడు :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి కి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నూజివీడు నియోజకవర్గం లోని ఆగిరిపల్లి మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ శోభనాచల స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని మంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి రాధాకృష్ణ కార్యదర్శి ఉమాయున్ కోశాధికారి కోటేశ్వరరావు పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యజ్ఞ నారాయణ పొన్నెకంటి శ్రీనివాసచార్యులు యూనియన్ నాయకులు జక్కుల కృష్ణ, ఓబులాపురం రమాదేవి, ఆత్మకూరి కాశీ విశ్వనాథం తదితరులు హాజరై మంత్రి పార్థసారధికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రచురించిన పల్లె వార్త ప్రత్యేక సంచికను పార్థసారథి ఆవిష్కరించారు. అనంతరం సాంబశివ నాయుడు, రాధాకృష్ణులు,పిల్లియజ్ఞ నారాయణ,పొన్నెకంటి శ్రీనివాసాచారి, మంత్రివర్యులకు శాలువాతో సత్కరించి యూనియన్ జ్ఞాపికను అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.