నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పి. శ్రీధర్
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ
పిడుగురాళ్ల :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం లో అనగా ఈరోజు 19/ 4 /2025 న పిడుగురాళ్ల పట్టణంలో పరిసరాల పరిశుభ్రత కోసం పురపాలక సంఘం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఈరోజు మూడవ శనివారం కావున స్వచ్ దివాస్ కార్యక్రమానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వ్యర్ధాల తొలగింపు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంగా ఇళ్లల్లో ఉన్న పాడైన టీవీలు, సెల్ ఫోన్లు, మిక్సీలు, చార్జర్లు ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించడానికి పురపాలక సంఘం సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది ఇళ్ల వద్దకు . వెళ్లి ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించారు అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫీసులు మరియు ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా ఈ వ్యర్థాలను సేకరించడం జరిగింది. మరియు ప్రతి వార్డుల్లోనూ ర్యాలీలు మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు మరియు మెప్మా సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పిడుగురాళ్ల పట్టణ సిఐ వెంకట్రావు మరియు కూటమి ప్రతినిధులు జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.