నారద వర్తమాన సమాచారం
“స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమం నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు అధికారులు మరియు సిబ్బంది.
నరసరావుపేట:-
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు,
ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా.. పోలీసు అధికారులు సిబ్బంది కలిసి.. పోలీసు ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ అధికారుల కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు, అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.
పోలీసు స్టేషన్ లోపల , ఆవరణలలోనూ పరిసరాలను పరిశుభ్రం చేశారు.
పిచ్చి మొక్కలను తొలగించారు.
మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ పోలీసు అధికారులకు, సిబ్బంది కి సూచించారు.
పోలీసు ప్రధాన కార్యాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏ.ఆర్. డిఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి వెల్ఫేర్ ఆర్.ఐ
ఎల్.గోపీనాథ్ మరియు ఏ ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.