నారద వర్తమాన సమాచారం
నకిరికల్లు మరియు రాజుపాలెం పోలీసు స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీకంచి శ్రీనివాసరావు ఐపిఎస్
ప్రాపర్టీ నేరాల నియంత్రణకు కృషి చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి.
పెండింగ్ కేసులను తగ్గించాలని, దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీ పై దృష్టి సారించాలి.
ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత చేరువ కావాలి.
పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బంది పనితీరును,మొత్తం రికార్డులను FIR ఇండెక్స్, కేసు డైరీలను, రిజిస్టర్ లను పరిశీలించారు.
ఈ సంధర్భంగా యస్.పి నకిరేకల్లు మరియు రాజుపాలెం ఎస్సై లకు పలు సూచనలు చేశారు….
రిసెప్షన్ నందు హాజరుగా ఉన్న మహిళా కానిస్టేబుల్ తో ఎస్.పి ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు రిసెప్షన్ కానిస్టేబుల్ వారితో మెలగవలసిన విధానము మరియు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసినప్పుడు వారికి అందజేయవలసిన రసీదు గురించి సూచనలు చేసినారు.
విచారణలో ఉన్న కేసుల యొక్క పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది మొదలగు అంశాలను గూర్చి క్షుణ్ణంగా పరిశీలించారు.
దర్యాప్తులో ఉన్న కేసులలో సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని, తగిన సూచనలు సలహాలను చేశారు.
విచారణ దశలో ఉన్న పోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ కు గల కారణాలు తెలుసుకుని, వాటి విచారణ వేగవంతం చేయడానికి పలు సూచనలు చేసారు.
రౌడీషీటర్ లపై నిరంతర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వివిధ కేసుల సిడి ఫైల్స్ ను, ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. పెండింగ్ లో ఉన్న కేసులను ప్రణాళికాబద్ధంగా త్వరితగతిన పూర్తిచేయాలని, ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
రెండు పోలీస్ స్టేషన్ ల పరిధిలో విజబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా చూడాలని, సమస్యలు ఉండే ప్రదేశాలను గుర్తించి బీట్లను పెంచి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు.
అక్రమ మద్యం, అక్రమ ఇసుక, గంజాయి మొదలైన నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిల్వలపై దృష్టి సారించాలని సూచించారు.
గ్రామ/వార్డు సచివాలయాల పోలీసుల సహకారంతో మహిళలపై జరుగుతున్న నేరాల అరికట్టడంపై దృష్టి పెట్టి, వాటిని అరికట్టాలని తెలిపారు.
అంతేకాకుండా సైబర్ నేరాలు, ముఖ్యంగా లోన్ యాప్ ల మోసాలు, ఫోక్సో నేరాలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని ప్రత్యేకంగా ఆదేశించినారు.
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క యోగక్షేమాల విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందే వ్యవస్థకు వెన్నెముక అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో
నకరికల్లు ఎస్సై చల్లా సురేష్ బాబు రాజుపాలెం ఎస్సై K.వేణు గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.