Sunday, July 20, 2025

అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.

నారద వర్తమాన సమాచారం

అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.

  1. జ్వాలానరసింహుడు — ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.
  2. అహోబలనరసింహస్వరూపము — హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.
  3. మాలోల నరసింహుడు — లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.
  4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.
  5. పావన నరసింహుడు — ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.
  6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.
  7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.
  8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము
  9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading