నారద వర్తమాన సమాచారం
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నువిజయవంతంచెయ్యలి కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్..
నరసరావుపేట:-
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వచ్చే నెల రెండో తారీఖున అమరావతి రాజధాని పురనిర్మాణ కార్యక్రమంలో పర్యటించనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా నుండి 600 బస్సులలో జనాలను చేరవేసే ప్రక్రియలో భాగంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు ఆదేశించారు. శనివారం జిల్లా అధికారులు మరియు మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 100 బస్సులను అధికంగా సమాయత్తం చేయాలని ఆయన సూచించారు. ప్రతి బస్సులో మెడికల్ కెట్లతోపాటు ఒక ఆశా వర్కర్ ను కూడా ఉంచాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బస్సులలో వచ్చే ప్రజలందరికీ అవసరమైన మంచినీటి వసతి మరియు ఉదయాన్నే అల్పాహారం మరియు భోజనం వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా శభా స్థలికి చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సంబంధిత డీఎస్ఓ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రతి బస్సులోనూ ఇద్దరు ప్రభుత్వ సిబ్బందిని ఇన్చార్జిల్ గా ఉంచాలన్నారు. కాకుండా సభాస్థలి వద్ద పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ని ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీటన్నిటికీ జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేను నోడల్ అధికారిగా నియమించినట్లు అయినా తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా చెల్లి తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ను పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ రాజా నాయక్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన సంబంధించి పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.