నారద వర్తమాన సమాచారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీకంచి శ్రీనివాసరావు ఐపిఎస్ .
నరసరావుపేట :-
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 73 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
నరసరావుపేట పెద్ద చెరువులో నివాసం ఉంటున్న నడికుడి పాపారావు అను అతని సోదరుడు ప్రశాంత్ కుమార్ బీటెక్ పూర్తి చేసినట్లు, ఆ సమయంలో నరసరావుపేటకు చెందిన తుపాకుల హనుమంతరావు తో పరిచయం ఏర్పడినట్లు, హనుమంత రావు ప్రశాంత్ కుమార్ ను విదేశాలకు పంపిస్తాను అని అరండల్ పేట లోని ఇంగ్లీషు స్ప్రింగ్స్, స్టడీ ఇన్ ఐర్లాండ్ వద్దకు రమ్మని చెప్పి 15 లక్షల రూపాయలు
దఫలవారీగా కట్టించుకొని, ఇప్పటికీ రెండు సంవత్సరాలు కాలం గడిచినను ఫిర్యాదు తమ్ముడు అయిన ప్రశాంత్ కుమార్ ను విదేశాల కు పంపించలేదని కట్టిన డబ్బులు ఇవ్వమని అడిగితే ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, డబ్బులు అడిగితే నీ ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నందుకుగాను తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాది అయిన నడికుడి పాపారావు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
దుర్గి మండలం అడిగోప్పల గ్రామానికి చెందిన కోట సంధ్యారాణి అను ఆమెకు ప్రభుత్వం హాస్పిటల్ నందు
స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడ కు చెందిన రెడ్డి గౌతమ్ మరియు పెద్దపులి శ్రీనివాసరెడ్డి వారిద్దరూ కలిసి 3,00,000/- లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా చెల్లించినట్లు, ఉద్యోగం గురించి అడగగా ఎటువంటి సమాధానం చెప్పకుండా దాటవేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామానికి చెందిన బాణావతి దివ్యభారతి అనే ఆమెకు 4 సం, క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు, ఫిర్యాదు భర్త గుంటూరు కోర్టు నందు అటెండర్ గా పనిచేయుచున్నట్లు, వివాహం జరిగినప్పటి నుండి ఫిర్యాదు భర్త, అత్తమామలు, ఫిర్యాది పై దాడి చేస్తూ, దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నందుకు గాను తగిన న్యాయం కొరకు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
చిలకలూరిపేట వడ్డెరపాలెం కు చెందిన అన్నపురెడ్డి సత్యవతి ఇంటి వద్ద నివాసం ఉంటున్న పల్లెపు లక్ష్మీ దుర్గ అని ఆమె మహిళ గుంటూరు జిల్లా కోర్టు నందు జడ్జి వద్ద పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకుని, గుంటూరు జిల్లా కోర్టు నందు బెంచ్ గుమస్తా ఉద్యోగం ఖాళీగా ఉందని జడ్జి సిఫారసు లతో ఉచితంగానే ఉద్యోగం పొందవచ్చు అని, అందుకు మీరు జడ్జి కి ఆర్థిక ఇబ్బందుల వలన సతమతమవుతున్నామని అందువలన ఉద్యోగం ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉత్తరం రాస్తే సరిపోతుంది అని నమ్మించి, ఫిర్యాదు చేత ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయించి ఆ లెటర్ మీద ఫిర్యాదు సంతకం తీసుకున్నట్లు, ఇంకొన్ని రోజులు గడిచాక నీ ఉద్యోగం జడ్జి గారు ఒప్పుకోలేదు అని రెండు లక్షల రూపాయలు ఇస్తే గాని ఉద్యోగం రాదని చెప్పగా ఫిర్యాది తన తల్లిదండ్రులకు మరియు తన భర్తకు తెలియకుండా బంగారం బ్యాంకు నందు తనఖా పెట్టి 2,00,000/- రూపాయలు ఇచ్చినట్లు, ఆ విధంగా మరో రెండు దఫాలలో 2,60,000/- రూపాయలు ఇచ్చినట్లు, తరువాత ఫిర్యాదు కి వల్లెపు లక్ష్మీ దుర్గ మీద అనుమానం వచ్చి విచారించగా ఆ పేరు గలవారు ఎవరు కూడా అక్కడ ఉద్యోగస్తులు లేరని తెలిసి
మోసపోయాను అని ఫిర్యాది బాధపడుతూ ఉండగా అది గమనించిన తన భర్త అడుగగా జరిగిన విషయం తెలుపగా సదరు విషయమై ఈ రోజు ఎస్పీని కలవడం జరిగింది.
రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన పమ్మి.వెంకటరెడ్డి అను అతనికి రుద్రవరం గ్రామస్తుడు అయిన అన్నపురెడ్డి.అంజిరెడ్డి 100 ఎకరాల మొక్కజొన్న పంట వేస్తానని ఐదు లక్షల రూపాయలు తీసుకున్నట్లు, పంట వేయించకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను డబ్బులు ఇవ్వమని అడిగినందుకు అసభ్యకరంగా మాట్లాడుతూ నీకు దిక్కున చోట చెప్పుకో అని బెదిరిస్తునందుకు గాను ఫిర్యాది తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
నరసరావుపేట ఇక్కుర్తి గ్రామానికి చెందిన కడియాల వెంకటేశ్వరరావు కు ఒక కుమార్తె లు ఒక కుమారుడు సంతానం కాక వారి వివాహంలో జరిపించి ఆస్తులను ఇద్దరికీ సమానంగా పంచినట్లు, ఐతే ఫిర్యాది తన కుమార్తె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు ది.25.04.2025 వ తేదీన ఫిర్యాదు కుమారుడు ఆయన శాంతి రాజు మరియు అతని భార్య ఫిర్యాది ఇంట్లోకి వచ్చి ఫిర్యాదుని మరియు ఫిర్యాదు భార్యను దుర్భాషలాడుతూ ఇంటి నుండి గెంటి వేసి తాళం వేసి ఇబ్బందులకు గురి చేసినట్లు, కావున ఫిర్యాదు ఆస్తికోసం మరియు అప్పు చేసి అయినా డబ్బులు లేకపోతే ఫిర్యాదుని మరియు ఫిర్యాదు నిత్యం పోతాను భయభ్రాంతులకు విచ్చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఫిర్యాదు కుమారుడైన కడియాల శాంతి రాజు మీద చట్టపరంగా తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.