Wednesday, April 30, 2025

చదువుల విషయంలో ఆడపిల్లలపై వివక్షత తగదు…. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు.

నారద వర్తమాన సమాచారం

చదువుల విషయంలో ఆడపిల్లలపై వివక్షత తగదు…. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు.

నరసరావుపేట:-

జిల్లా విద్యా శాఖాధికారి యల్.చంద్రాకళ జిల్లా విద్యాశాఖను గాడిలో పెట్టారు…. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

తల్లికి వందనము కార్యక్రమము ద్వారా సంవత్సరానికి 15 వేలు ఈ సంవత్సరం నుండే ప్రారంబం.. ప్రభుత్వ చీవ్ విప్ జి.వి.ఆంజనేయులు
.
జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాటశాలలకు శివశక్తి ఫౌండేషన్ తరపున ప్రోత్సాహకాలు అందిస్తాము… ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు.

పల్నాడు జిల్లా వెనుకబడిన ప్రాంతము అయినప్పటికీ పిల్లలో కష్టపడే తత్వము గుర్తించడం జరిగిందని, అది వారి మంచి బావిష్యతుకు దారులు వేస్తాయని జిల్లాకలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బువన చంద్రా టౌన్ హాలులో జిల్లా విద్యా శాఖ ఆద్వర్యంలో 2024-2025 వ విద్యా సంవత్సరములో 580 మార్కులలు సాధించిన సుమారు 92 మంది విద్యార్దుల అబినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రములో విశిష్ట అతిదిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.అరణ్ బాబు జ్యోతి ప్రజ్వలన, ప్రార్ధనా గీతం అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా 10 వతరగతి ఉత్తీర్ణత శాతం 95 శాతం నిర్ణయించడం జరిగిందని, అది 85 శాతంగా ఉన్నదని అన్నారు. ఈ సంవత్సరం వచ్చిన ఫలితాలలో బోల్లాపల్లి, మాచవరం, మరియు వెల్దుర్తి మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు. మాచేర్లపై రానున్న సంవత్సరములో అంచనాలు అధికంగా ఉంటాయన్నారు. రానున విద్యా సంవత్సరం లో ప్రారంబలోనే స్టడీ మెటీరియల్ అందచేయడం జడురుగుతుందన్నారు. కారెంపూడి లో ఆద్యాపకుల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈ సంవత్సరం 10 వ తరగతి ఫలితాలలో పల్నాడు జిల్లా 18 వస్తానం నుండి 11వ స్థానానికి వచ్చిందన్నారు. రాబోయే రోజులు ఆడపిల్లలదే అని అబిప్రాయ పడ్డారు. విద్యార్ధులకు వివిధ రకాల ప్రోత్సాహాలు అందించడం అభినందనీయమని అన్నారు. టీచర్లకు కూడా అందించడం హర్షణీయమని కొనియాడారు.
ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసన సభ్యులు జీ.వి.ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అభినననీయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో మంచి సంస్కరణలు తీసుకురావడం జరుగుతున్నదని అన్నారు. జిల్లలో 84.15 % ఉతీర్నత సాధించడం గొప్ప విషయం అని కొనియాడారు. మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశం లోనే అగ్రగామిగా విద్యా శాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందన్నారు. విద్యార్ధులకు విద్య తో పాటు ఆటలు, సామాజిక విలువలు తెలియ చేయాలని అన్నారు. ప్రభుత్వ పాటశాలలో చదువుకున్నా వాళ్ళలో పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా అత్యధిక మార్కులు సాదించి మొదటి 3 స్థానాలలలో నిలచిన విద్యార్దులు కు శివ శక్తీ ఫౌండేషన్ తరపున నగదు బహుమతి అందచేసారు. మొదటి రెండు స్థానాల వారికి 25 వేల రూపాయలు, తృతీయ స్థానం సాధించిన విద్యార్ధికి 15 వేల రూపాయలు నగదును అందచేసారు. అంతేకాకుండా గ్రూప్-1 మరియు సివిల్స్ కు సమాయత్తం అవుతున్న పెద విద్యార్ధులకు ఆర్ధిక సహాయాన్ని శివ శక్తీ ఫౌండేషన్ తరపున అందచేయడము జరుగుతుందన్నారు. అంతేకాకుండా జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాటశాలలకు శివశక్తి ఫౌండేషన్ తరపున ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
విజయవాడ- గుంటూరు పట్టబద్రుల నియోజికవర్గ శాసన మండలి సభ్యులు .ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్య అనీది ఎవరు దోచుకునేదికాదు అన్నారు. మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యాప్తి జరగాలని అన్నారు. తమ విద్యా సంస్థలో 580 మార్కులు వచ్చిన విద్యార్దులు ఉంచిత విద్యను అందించడం జరుగుతుందన్నారు. పి.4 కార్యక్రమం చాల మంచిదని అన్నారు. విద్య పట్ల ప్రభుత్వానికి చిత్త సుద్ది ఉందన్నారు. విద్యా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వ మెగా డి.యస్.స్సి ని ప్రకించి ఒకేసారి 16,347 పోస్టులలో నియాకం చేపట్టనున్నారని తెలిపారు.
మాచర్ల నియోజికవర్గ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మా రెడ్డి మాట్లాడతూ విద్యా శాఖాధికారి , మండల విద్యాశాఖాధికారి,ఆద్యాపకులకు అభినందనలు తెలిపారు. బాలుర పై కూడా దృష్టి పెట్టాలని అభిప్రాయ పడ్డారు. హాస్టల్ విద్యార్దులు మంచి ఫలితాలు సాశిస్తున్నారన్నారు. అదే విధముగా డే స్కాలర్ లపై మరింత దృష్తి పెట్టాలన్నారు. 85 శాతం ఉత్తెర్నత సాధించిన పాతసలలకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా ఆయన మొదటి స్థానం సాధించిన పావని చంద్రిక మరియు ద్వితీయ స్థాన సాధించిన షేక్ సమీరాలకు లక్ష రూపాయల చొప్పున మరియు తృతీయ స్థానం సాధిచిన ప్రత్తిపాటి ఆమూల్యకు 50 వేల నగదు అందచేసారు. త్వరలో 85 శాతం ఉత్తీర్ణత శాధించిన ప్రతి స్కూల్ అద్యాపకులకు ప్రోత్సాహకాలు అందిచడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ కలెక్టర్ ప్రోత్సాహంతో విద్యాశాఖ మంచి ర్యాంకులు సాధించిందని అన్నారు. తల్లిదండ్రుల కష్టం తో పాటు పిల్లలో ఇష్ట పడే తత్త్వం ఉండడం గొప్ప విషయమన్నారు. సైన్స్ తో పాటు ఆర్తిఫిసియల్ ఇంటలి జెన్స్ తో ముందుకు వేల్లాలన్ని అన్నారు. పిల్లలకు మంచి స్టడీ మేటేరియల్ అందించుటలో కలెక్టర్ పాత్ర చాల ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా విద్యా శాఖదికారి యల్.చంద్రకళ, మండల విధ్యాశాఖాదికారులు, పాటశాలలో ప్రదానోపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు. ..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading