నారద వర్తమాన సమాచారం
విశాఖ, కుప్పం, గుంటూరు, మేయర్ పదవులు దక్కించుకున్నా టిడిపి
విశాఖ గుంటూరు, కుప్పం మేయర్ పదవులను దక్కించుకున్న టీడీపీ.. షాక్ లో వైసీపీ విశాఖ మహానగర పాలక మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికై నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి.. ఆయనకు ధ్రువపత్రం అందజేశారు.
మహా విశాఖ నగర పాలక సంస్థకు 2021లో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాస రావు పేరును అధిష్ఠానం ప్రకటించింది. అప్పట్లో మెజార్టీ లేకపోవడంతో ‘పీలా’కు పదవి దక్కలేదు.
నాలుగేళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు, వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాస రావుకు పార్టీ అధిష్ఠానం మరోసారి అవకాశం కల్పించింది. మేయర్‌గా పీలా ఎన్నికతో జీవీఎంసీ కార్యాలయం బయట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఆయన అభిమానులు క్రేన్‌పై భారీ గజమాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పీలా శ్రీనివాస రావు మాట్లాడుతూ నిస్వా ర్థంగా పనిచేస్తానన్నారు. సీఎం చంద్రబాబునా యుడు చెప్పినట్టు విలువలతోపాటు పార్టీ, ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేస్తానన్నారు.
తనకు మేయర్‌గా అవకాశం కల్పించిన కార్పొరేటర్లు, కూటమి నాయకులకు ధన్యవాదా లు తెలిపారు. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు.
కూటమి బలపరిచిన రవీంద్రకు 34, వైసీపీ మద్దతిచ్చిన వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి.* కుప్పం కూడా టీడీపీకే చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక చైర్మన్ ఎన్నికను నిర్వహించారు.
ఐదో వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్‌ను టీడీపీ అభ్యర్థిగా, హఫీజ్‌ను వైసీపీ ప్రతిపాదించింది. సెల్వ రాజ్‌కు 15 ఓట్లు, హఫీజ్‌కు 9 ఓట్లు వచ్చాయి. దీంతో సెల్వరాజ్ గెలిచినట్లు ప్రకటించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.