నారద వర్తమాన సమాచారం
ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్
నరసరావుపేట:-
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండో తారీఖున అమరావతి రాజధాని పురనిర్మాణ కార్యక్రమంలో పర్యటించనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా నుండి 800బస్సులలో జనాలను చేరవేసే ప్రక్రియలో భాగంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. శనివారం జిల్లా అధికారులు మరియు మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు సలహాలు అందజేశారు. ప్రతి బస్సులో మెడికల్ కెట్లతోపాటు ఒక ఆశా వర్కర్ ను కూడా ఉంచాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బస్సులలో వచ్చే ప్రజలందరికీ అవసరమైన మంచినీటి వసతి మరియు ఉదయాన్నే అల్పాహారం మరియు భోజనం వసతులు ఏర్పాటు చేయాలన్నారు. క్రమంగా ఉన్నాను రేపు నుంచి నెల్లూరు భోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి పదింటికల్లా బస్సులను సమాయత్తం చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా శభా స్థలికి చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సంబంధిత డీఎస్ఓ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రతి బస్సులోనూ ఇద్దరు ప్రభుత్వ సిబ్బందిని ఇన్చార్జిల్ గా ఉంచాలన్నారు. కాకుండా సభాస్థలి వద్ద పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ని ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీటన్నిటికీ జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేను నోడల్ అధికారిగా నియమించినట్లు అయినా తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ను పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ రాజా నాయక్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఎక్కువగా పెదకూరపాడు నియోజకవర్గ నుంచి ప్రజలను తరలించే విధంగా. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయ పరుచుకోవాలి అని సూచించారు. ప్రధానమంత్రి పర్యటన సంబంధించి పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.