నారద వర్తమాన సమాచారం
ప్రధాని మోదీ పర్యటన గురించి కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి :-
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ కార్యాలయం లో మే రెండో తారీకు జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ప్రోగ్రాం పరిశీలకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నియోజకవర్గ పరిశీలకులు తాత జయప్రకాష్ నారాయణ
దేశమైనా, రాష్ట్రమైనా రాజధాని తప్పనిసరి. రాజధాని ఉంటేనే అన్ని రంగాలు అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.
అమరావతి పేరు ప్రపంచమంతా వినిపించేలా, దేశం గర్వించేలా మోదీ సభను విజయవంతం చేద్దాం శాసన సభ్యులు కన్నా
మే 2న అమరావతిలో జరిగే ప్రధాని బహిరంగ సభ విజయవంతంపై కూటమి శ్రేణులకు శాసన సభ్యులు కన్నా దిశానిర్దేశం
కూటమినాయకులు, శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా అమరావతి పునర్నిర్మాణ వేడుకను విజయవంతం చేయాలి శాసన సభ్యులు కన్నా
రాజధాని నిర్మాణంతో రాష్ట్రానికి పరిశ్రమలు.. పెట్టుబడులు వచ్చి భూముల ధరలు పెరిగి ప్రజల జీవనచిత్రమే మారిపోతుంది
మే 2న అమరావతిలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభ విజయవంతానికి కూటమిపార్టీల నేతలంతా కలిసికట్టుగా కృషిచేయాలని, శాసన సభ్యులు కన్నా కోరారు
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణం మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.