నారద వర్తమానం సమాచారం
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పరిశీలించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
స్థలాల సందర్శన… యడ్లపాడు లో ఏర్పాటుకు జిల్లా శాఖల అధికారులు..
ప్రజలకు ఆహారం,నీటి సదుపాయాల కల్పనకు ప్రణాళిక..
ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేతృత్వంలో పరిశీలిన…
యడ్లపాడు:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 2న జరిగే అమరావతి సభ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్న కార్యక్రమానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. బుధవారం జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు యడ్లపాడు గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి వచ్చే ప్రజల కోసం 369 బస్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.ఈ బస్సుల ప్రయాణికులకు ఆహార, మంచినీటి సౌకర్యాల కోసం యడ్లపాడు మండలంలోని మూడు ప్రాంతాలను పరిశీలించగా, హైవే వంతెన పక్కన (చిలకలూరిపేట వైపు) ఉన్న స్థలం అనుకూలంగా ఉండడంతో అక్కడే ఏర్పాట్లు ఖరారు చేశారు.మండలంలోని 23 గ్రామాలకు చెందిన ప్రజలకు వారి గ్రామాల్లోనే ఆహారం సిద్ధం చేసి బస్సుల్లో అందించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఆయా ఏర్పాట్లు పలు శాఖలు సమన్వయంతో విజయవంతం అయ్యేలా జిల్లాఅధికారుల బృందం ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.ఇందులో భాగంగా బుధవారం జిల్లా అధికారుల బృందం యడ్లపాడు గ్రామాన్ని సందర్శించింది. పోలీసు, మార్కెటింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులతో ఫుడ్ పాయింట్‌ను నోట్ చేశారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, డీఆర్‌ఓ మురళి, మార్కెటింగ్ ఏడి సూర్యప్రకాశ్‌రావు, యడ్లపాడు,నాదెండ్ల తహసీల్దార్లు, ఏవీ రమణ, యడ్లపాడు డీటీ అనురాధ, ఎంపీడీవో హేమలతాదేవి, స్వరూపారాణి, ఈవోపీఆర్‌డీ షేక్ జాకీర్‌హుస్సేన్, అర్బన్‌సీఐ టి.రమేష్, యడ్లపాడు, రూరల్ ఎస్‌ఐలు టి.శివరామకృష్ణ, జి.అనిల్‌కుమార్, వీఆర్వో కేఏ చారి, మండల టిడిపి అధ్యక్షుడు సాయి బాబు మరియు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.