నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో ఘనంగా గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం
పిడుగురాళ్ల
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో జరిగే జాతర్లలో గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం చెప్పుకోదగినది తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే పిడుగురాళ్ల పట్టణంలో లో నిర్వహించే గంగమ్మ తల్లి తిరునాళ్ల సుప్రసిద్ధమైంది.ఒకనాటి పల్నాటి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన ఈ గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఇది.
అన్ని గ్రామాలకూ ఉన్నట్టే పిడుగురాళ్ల పట్టణంలో గ్రామదేవత శ్రీ గంగమ్మ. తల్లి దేవాలయం ఉంది. పట్టణంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ తిరునాళ్ల మహోత్సవానికి నియోజకవర్గంలో నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
పిడుగురాళ్ల పట్టణంలో గ్రామ దేవతగా వేంచేసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం వైశాఖ మాస శుక్లపక్ష పంచమి తిధినాడు అనగా 2 /05/ 2025 నుండి శుక్రవారం 4/05/2025 ఆదివారం వరకు అమ్మవారి ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3/5/ 2025 ఉదయం 7 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వరకు పట్టణంలో ఉన్న ప్రతి గడప నుండి మహిళలు అందరూ కలిసి 1008 కలశాలతో కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి పురవీధుల్లో భారీ ఊరేగింపుతో గంగమ్మ తల్లి దేవస్థానం వరకు కలశాలతో వచ్చి అమ్మవారి మూలవిరాట్ కు కలశాభిషేకం చేశారు.
మరుసటి రోజు ఉదయం 4/5/2025 న ఉదయం 10 గంటలకు గంగమ్మ గుడి ఆవరణలో శ్రీ గంగా సమేత ఉమామహేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం జరుపుతారు. కళ్యాణ అనంతరం ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తిలో ను పూల అలంకరణ,విద్యుత్ దీపాలంకరణతో మహా గ్రామోత్సవ కార్యక్రమం జరుపుకుంటారు.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మునిసిపల్ చైర్ పర్సన్ కొత్త చిన్న సుబ్బారావు మరియు గంగమ్మ తల్లి గుడి అధ్యక్షులు కొక్కెర ఏడుకొండలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పట్టణ పెద్దలు తదితరులు అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు.