నారద వర్తమాన సమాచారం
తప్పు ఎవరిది?
సింహాచలం ప్రమాద ఘటనపై నేడు ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక
విశాఖ జిల్లా :
విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టింది.
ఇందులో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేస్ కుమార్, ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ , ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే, ఈ కమిటీ సభ్యులు సింహాచలంలో పర్యటించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
అధికారులు, కాంట్రాక్టర్, ఇతర సిబ్బందిని విచారించారు. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణం లో త్రిసభ్య కమిటీ లోతుగా దర్యాప్తు చేసింది.రెండు రోజులపాటు జరిగిన ఈ విచారణలో.. ఆలయ, టూరిజం, జిల్లా అధికారులతోపాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసులతో కూడా కమిటీ సభ్యులు మాట్లాడారు.
అయితే, విచారణ నివేదికను ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్రిసభ్య కమిటీ అందజేయ నుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గోడ నిర్మాణం చేపట్టినట్లు కమిటీ గుర్తించింది. అంతా నోటిమాట మీద హడావి డిగా చేశారని కమిటీ తే ల్చింది. గోడ వద్ద శాంపిల్స్ కమిటీ సేకరించింది.
2022 డిసెంబర్ లో ప్రసాద్ స్కీంలో భాగంగా కేంద్రం రూ.54కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ నిధులతోనే ఆ గోడ నిర్మాణం చేసినట్లు కమిటీ గుర్తించింది.
అయితే, నిర్మాణంపై అధికారులు తలోమాట చెప్పినట్లు తెలిసింది. ప్రమాద ఘటన తరువాత మరో టెండర్ పిలిచిన ఏపీటీడీసీ. అన్ని వివరాలతో ఇవాళ త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.