నారద వర్తమాన సమాచారం
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి
రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్)తో రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని రాష్ట్ర విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం నాడు కాకాని నగర్ కార్యాలయంలో లబ్ధిదారులకు తంగిరాల సౌమ్య అందజేశారు. వీరిలో పసుపులేటి యోగాన్స్ కుమార్ (అనాసాగరం) 8వ నెలలో పుట్టడం వలన ఖమ్మం బిలీఫ్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుని సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు వారికి 1,99,978 రూపాయల చెక్కును వారి తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్దిదారులు ముఖ్యమంత్రికి, తంగిరాల సౌమ్య కు కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.