Thursday, July 3, 2025

పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో విమాన ప్రయాణం : ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

నారద వర్తమాన సమాచారం

పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో విమాన ప్రయాణం : ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

పేద,సామాన్య,మధ్య తరగతి ప్రజలకు బస్సు, రైలు ప్రయాణాలు సుపరిచితమే, విమాన ప్రయాణం ఒక కల.

రెక్కలు తొడిగిన ఆశలు. నింగిన తాకే కలలు.. ప్రతిభకు ప్రేరణ ఆశయానికి గౌరవం వెరసి నింగికెగిసిన విమాన ప్రయాణం.

ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య.

నందిగామ

నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మంగళవారం నాడు ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులు వెంకట నాగ శ్రీ సాయి కంచికచర్ల (587) స్పందన వెంకట నాగ శ్రీ.కంచికచర్ల (584) యశస్విని ముప్పాళ్ళ (583) అనూష తోటరావులపాడు (577) గూడూరు గణేష్ రెడ్డి అల్లూరు (573) సిరి వేరు నవ్య వెల్లంకి (570) లను తల్లిదండ్రులు,విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి సన్మానించిన ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  మాట్లాడుతూ. ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది.ప్రపంచంలో అతి కొద్ది మంది చదువుకునే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు వారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏ విధంగా ఆధునికంగా పరుగులు పెడుతోందో మనం చూసాం. గత ఐదేళ్లు వైసిపి పాలనలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు. ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం క్రమబద్దీకరణ చేస్తూ విద్యార్థుల యూనిఫామ్, పుస్తకాలు, సిలబస్, సబ్జెక్టులు అన్నీ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు రాష్ట్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్  ఈ సందర్భంగా నారా లోకేష్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక విజనరీ లీడర్ ప్రపంచ ప్రఖ్యాత నేతలలో అగ్రగామి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటీవలే అమరావతి పునర్మాణ పనులకు  దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  శంకుస్థాపన చేయడం జరిగినది.ఎన్నో కంపెనీలు అమరావతిలో రాబోతున్నాయి.ఈరోజు నందిగామలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో నియోజకవర్గంలోని టాప్ ఫైవ్ విద్యార్థులకు బహుమతిగా ఈరోజు విమాన ప్రయాణం చేయించడం జరుగుతున్నది. కానుకలు బహుమతులు అంటే వస్తు రూపంలో కాకుండా ఒక అనుభూతిని కలిగించే విధంగా పార్టీ ఆదేశానుసారం విద్యార్థిని విద్యార్థులతో గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు విమానంలో నేను కూడా ప్రయాణం చేయబోతున్నాను. ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయకంగా కార్యక్రమ నిర్వహణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారై ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలకు బస్సులో, రైలులో ప్రయాణం చేస్తారు కానీ విమాన ప్రయాణం ఒక కల. నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఒక సినిమా చూశాను ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు తన జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని కలగంటాడు. ఆ సినిమా చూసినా అనంతరం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తప్పకుండా ఈ అనుభూతిని అందజేయాలని అనుకున్నాను. ఈరోజు దానిని ఆచరణలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు ఈ అనుభూతి వారి కలలను సహకారం చేసుకోవడానికి మా ఈ ప్రోత్సాహం. భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులు దేశ, విదేశాలలో విమానాలలో ప్రయాణం చేయాలని భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు.ఉన్నతమైన మార్కులను సాధించిన పిల్లలకు నా ఆశీస్సులు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading