నారద వర్తమాన సమాచారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
నరసరావుపేట:-
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 77 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన కారుమంచి శిరీష కు
ది.23.01.2025 వ తేదీన బాల యేసుతో పెద్దల సమక్షంలో జరిపించినట్లు, గతంలో మీరు ప్రేమించుకుని తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు ఈ క్రమంలో ఫిర్యాదు భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఫిర్యాదులు పట్టించుకోకుండా విడాకులు ఇవ్వమని శారీరకంగా మానసికంగా వేదిస్తున్నందుకు గాను తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాది అర్జీ ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట పట్టణ మనకు చెందిన బొప్పన అరుణ ఆయన రే షన్ నరసరావుపేట పట్టడానికి చెందిన కోట చిన్న బాబుకి 1,50,000/- పెట్టినట్లు అయితే ఫిర్యాది కుమారుడు మరణించి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయినను కోట
చినబాబు హనుమకొండ నీవు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని తిడుతూ బెదిరిస్తున్నందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన కొర్నేపాటి బుల్లెబ్బాయి అను అతనికి గల ఎకరం భూమిలో మట్టి తోలుకోవడానికి గాను అదే గ్రామానికి చెందిన వేమవరపు కొండయ్య మరియు శివా అను వారులకు 1,70,000/- రూపాయలకు ఇచ్చినట్లు, సదరు డబ్బుల గురించి అనేక మార్లు అడుగగా అదిగో ఇదిగో ,వారం నెల అంటూ గడుపుతూ వచ్చినట్లు, ది.06.04.2025 వ తేదీన డబ్బుల గురించి వేమవరపు కొండయ్య, శివ లను గట్టిగా నిలదీయగా పిర్యాది మీదకు ఎగబడి, దాడి చేసి ఈసారి డబ్బులు అని ఎక్కడైనా మమ్ములను అడిగావంటే చంపుతామని బెదిరించినందుకు గాను తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
వెల్దుర్తి మండలం రచ్చమల్ల పాడు గ్రామానికి చెందిన కాకునూరి శ్రీను ది.27.04.2025 వ తేదీన కారంపూడి మండలం కాచవరం గ్రామంలో బంధువుల దశ కర్మలకు వెళ్లినట్లు, అంతట అక్కడ చీమలదిన్నె అంజి అను వ్యక్తి ఫిర్యాదు వద్దకు వచ్చి నన్ను గుర్తుపట్టినావా అని అడిగి ఫిర్యాదు చొక్కా బలవంతంగా లాగగా లోపలి భాగంలో ఉన్న 50,000/- రూపాయల కట్ట కింద పడినట్లు వెంటనే చీమలదిన్నే అంజి ఆ డబ్బులు బలవంతంగా తీసుకొని నీకు దిక్కున చోట చెప్పుకో అని ఫిర్యాది ని తిట్టి ద్విచక్ర వాహనంపై పారిపోయినట్లు, అందుకుగాను అతనికి ఫోన్ చేయగా దుర్భాషలాడుతూ తిడుతున్నట్లు కావున కారణం లేకుండా కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళినటువంటి చీమల దీన్నే అంజయ్య అంజయ్య మీద చట్టపరమైన చర్యలు తీసుకొని డబ్బులు ఇప్పించాల్సిందిగా ఈ రోజు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
కారంపూడి మండలం గాదెవారిపల్లె గ్రామానికి చెందిన దోర్నాల నాగిరెడ్డి మరియు కొంతమంది రైతులకు శంకరాపురం శివారు నందు సుమారు 20 ఎకరాల భూమి ఉన్నట్లు, ఆ భూమికి తూర్పు వైపున శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వారు కరెంటు సబ్ స్టేషన్ నిర్మించడం జరిగింది. గతంలో వర్షాకాలంలో పైనుండి వచ్చే వర్షపు నీరు వారు కట్టిన సబ్ స్టేషన్ నుండి ప్రవహించేది. సిమెంట్ ఫ్యాక్టరీ వారు వర్షపు నీరు రాకుండా సబ్ స్టేషన్ కు తూర్పు వైపున పెద్ద ప్రహరీ గోడ నిర్మాణం చేయడం వలన ఆ నీరు మొత్తం వ్యవసాయ భూమి పై ప్రవహించి పంటలు దెబ్బ తింటున్నట్లు, ఆ విషయం శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వారి యాజమాన్యానికి తెలియజేసి పొలాలలో వర్షపు నీరు రాకుండా న్యాయం చేయమని యాజమాన్యం వారికి ఎన్ని సార్లు విన్నవించుకున్ననూ వారు ఎటువంటి చర్యలు తీసుకొనలేదని, ఇదే విషయమై శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫీల్డ్ జి.ఎం రావు ని కలవడానికి వెళ్లగా రైతులను దుర్భాషలాడి మీకు దిక్కున చోట చెప్పుకోండి ఎలాంటి పనులు చేయమని వాళ్ల సెక్యూరిటీ గార్డు తో గెంటించినందుకు గాను ఫిర్యాది మరియు కొంత మంది రైతులు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
చిలకలూరి పట్టణo సుభాని నగర్ కు చెందిన షేక్ అన్వర్ భాష అను అతనికి బోర్డు టు కన్సల్టెన్సీ నుండి సీమా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హరీష్ సింగ్ వారి వద్ద నుండి ఫిర్యాదు కి కాల్ రావడం జరిగినట్లు, అంతట ఫిర్యాది ఆఫీసుకు వెళ్లి కలిసినట్లు, ఫిర్యాదు ని జర్మనీకి పంపుటకు 6,00,000/- లు ఖర్చు అవుతుందని చెప్పగా, మొదటగా ఫిర్యాది 2,00,000/- లు చెల్లించినట్లు, జర్మనీ వర్కింగ్ వీసా స్టాంపింగ్ కొరకు మరలా 4,00,000/- రూపాయలు కట్టాలని కడితే మీరు నెల రోజుల్లో జర్మనీ వెళ్ల వచ్చని నమ్మబలికి వారి అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు, నెల రోజులలో అబ్రాడ్ కు పంపిస్తానని చెప్పి 14 నెలలు అయిననూ ఎటువంటి సమాచారం ఇవ్వనట్లు,అంతట ఆఫీస్ వద్దకు వెళ్ళగా ఆఫీసు ఎత్తివేసినట్లు తెలిసి అడ్రస్ కనుక్కొని వెళ్లి తన పరిస్థితి గురించి అడగగా నెల రోజులు గడువు ఇస్తే మీ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి నెల రోజుల తర్వాత నాకు కేసులు ఏమీ కొత్త కాదు, మీరు ప్రాణాలతో కూడా ఉండరని బెదిరించి నట్లు అంతట ఫిర్యాదు తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.